Viral Video
Viral Video: సీయోని చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవవైవిధ్యం బాగుంటుంది. ఈ ప్రాంతంలో రైతులు చెరకు, బంగాళదుంప, ఉల్లి వంటి పంటలు వేస్తుంటారు. అడవి పందులు రాత్రిపూట ఈ పంటలపై పడి తింటాయి. తెల్లవారుజామున అడవులకు వెళుతుంటాయి. అయితే ఇటీవల ఓ అడవి పంది పగటిపూట సమీపంలో ఉన్న పంట చేలపై పడింది. దానిని రైతులు తరిమి కొట్టారు. ఇదే క్రమంలో అడవి పంది పారిపోయే దారిలో పులి ఉంది. అడవి పందిని చూసేసరికి దానిని వేటాడాలని అనిపించింది. పైగా ఆ పులి ఆకలితో ఉంది. అంతే అమాంతం అడవిపందిపై దాడికి యత్నించింది. పులి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు అడవి పంది కూడా పరుగులు పెట్టింది. ఇదే క్రమంలో సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడింది. పులి కూడా అడవి పందిని అనుసరిస్తూ అదే బావిలో పడింది.. ఆ బావిలో అటు పులి.. ఇటు పంది ఉన్నాయి. సమీపంలోనే అడవి పంది ఉన్నప్పటికీ దాడి చేయాలని దుస్థితి పులిది. ఆ బావిలో కొక్కాలు ఉండడంతో.. రెండు జంతువులు వాటిని పట్టుకుని చాలాసేపు నీళ్లల్లో ఉన్నాయి. ఆ వ్యవసాయ బావిలో ఈ రెండు జంతువులు పడిన తీరును సమీపంలో ఉన్న ఓ వ్యక్తి గమనించాడు. గ్రామానికి వెళ్లి ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు.
అటవీశాఖ అధికారులు కాపాడారు
పులి, అడవి పంది బావిలో పడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. అటవీశాఖ అధికారులు పెద్ద క్రేన్ సహాయంతో అక్కడికి వచ్చారు. ముందుగా పులికి మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత అడవి పందికి కూడా అదే పని చేశారు. దీంతో రెండు జంతువులు మత్తులో కింద పడుతున్న క్రమంలోనే క్రేన్ ను అధికారులు కిందికి దించారు. అందులో ఉన్న వల లాంటి భాగంలో పులి, అడవి పంది పడిపోయాయి. వాటిని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చిన అధికారులు.. మత్తు వదిలిన అనంతరం వేరువేరు మార్గాలలో వాటిని అడవిలోకి పంపించారు.. అడవి పందిపై దాడి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అమాంతం మీద పడే సందర్భం ఉన్నప్పటికీ.. పులి ఏమాత్రం ఆ పని చేయలేదు. పైగా ప్రాణాలు కాపాడుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. మరోవైపు అడవి పంది కూడా అదే పని చేసింది. అందువల్లే ఆపత్కాలంలో ఎంతటి బలవంతులైనా సరే ప్రాణాలు కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు. మధ్యప్రదేశ్ లో సీయోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనే పై వ్యాఖ్యలకు బలం చేకూర్చుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
A tiger and a boar ccidentally fell into a well in Pipariya village near the reaserve. Thanks to the swift action of the Pench Tiger Reserve rescue team, big cat and boar were safely rescued! With expert coordination & care, both animals were pulled out unharmed and released back pic.twitter.com/s8lRZH8mN5
— Pench Tiger Reserve (@PenchMP) February 4, 2025