Viral Video: “బండి కాదు మొండి ఇది సాయం పట్టండి.. పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి”.. వెనుకటికి ఓ సినిమాలో బహుళ ప్రజాదరణ పొందిన పాట ఇది. ఇప్పటికీ పెట్రోల్ ధరలను ప్రభుత్వం పెంచినప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఈ పాటను అన్వయించుకుంటూ వ్యంగ్యంగా వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అనుభవమే ఓ రాపిడో బైకర్ కు ఎదురైంది.. కాకపోతే అనుభవం పెట్రోల్ ధరలు పెరగడం వల్ల కాదు.. పెట్రోల్ అయిపోవడం వల్ల.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. ఇంతకీ అతని కథ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
హైదరాబాద్ మహానగరంలో ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్లాలంటే ఏదో ఒక ప్రయాణ సాధనం కచ్చితంగా అవసరం. ముఖ్యంగా వివిధ ఉద్యోగాలు చేసే వారికి అది అత్యంత అవసరం. మెట్రో, లోకల్ ట్రైన్, లోకల్ బస్ వంటి ఎన్ని సౌకర్యాలు వచ్చినప్పటికీ హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ వెతలు తీరడం లేదు. అయితే ఇందులో చాలామంది సాధారణ ఉద్యోగులు ఉండటంతో ఆటోల మీటర్ల మీద భారీగా చెల్లించేంత స్తోమత వారికి ఉండదు. అయితే ఇలాంటివారిని లక్ష్యంగా చేసుకొని రాపిడో అనే సంస్థ బైక్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు గానూ ఫోన్ లో రాపిడో యాప్ డౌన్లోడ్ చేసుకుని..బైక్ ను బుక్ బుక్ చేసుకుంటే.. బైకర్ వచ్చి మనల్ని ఎక్కించుకొని గమ్యస్థానం వద్ద దింపుతాడు. సేమ్ ఓలా లాగే ఈ యాప్ కూడా పని చేస్తుంది. కాకపోతే ఓలాలో కార్లు, ఆటోలు ఉంటే.. రాపిడో లో బైక్ లు ఉంటాయి. ఈ రాపిడో సంస్థ కింద వేలాదిమంది బైకర్లు ఇలా కమీషన్ పద్ధతిలో పని చేస్తూ ఉంటారు. అయితే ఈ రాపిడ్ లో పని చేసే ఒక బైకర్ కు ఒక విచిత్రమైన అనుభవం ఎదురయింది. అది అతడిని వార్తల్లో వ్యక్తిని చేసింది.
హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగి రాపిడో ద్వారా బైక్ బుక్ చేశాడు. ఆ బైకర్ తన స్కూటీ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికుడిని ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళగానే అతడి స్కూటీ లో పెట్రోల్ అయిపోయింది. ఇదే విషయాన్ని కస్టమర్ కు చెప్తే అతడు ఒప్పుకోలేదు. బండి దిగండి పెట్రోల్ కొట్టించుకుని వస్తానని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. నేను స్కూటీ మీద అలానే ఉంటాను నువ్వు తోసుకొని వెళ్ళు అని అన్నాడు. దీంతో గత్యంతరం లేక ఆ రాపిడో బైకర్ కస్టమర్ ను అలాగే కూర్చోబెట్టుకొని సమీపంలో పెట్రోల్ బంక్ వరకు తోసుకుని వెళ్ళాడు. ఈ తతంగాన్ని చూసిన కొంతమంది తమ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. రాపిడో బైకర్ పై కస్టమర్ కు మానవత్వం లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా.. పెట్రోల్ చూసుకోవాల్సిన బాధ్యత రాపిడో బైకర్ కు లేదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్.. అలాగే తోసుకుంటూ వెళ్లిన రాపిడో రైడర్
హైదరాబాద్ – ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళ్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది.
దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను రైడర్ అడగ్గా అతను… pic.twitter.com/BWdfFkNkxu
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2024