IPL 2025 (1)
IPL 2025: ప్రతి ఏడది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు.. దేశ విదేశాల నుంచి స్టార్ కళాకారులను బిసిసిఐ రప్పిస్తుంది. అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తుంది. ఈసారి బాలీవుడ్ స్టార్ నటి దిశా పటాని, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ శ్రేయ ఘోషల్, పంజాబీ గాయకుడు కరణ్ ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా మిగతా తారలు కూడా ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తారు.
Also Read: ఎయిర్‌పోర్టులో రోహిత్ శర్మ అసహనం.. కారణం ఏమిటంటే..!
టికెట్ ఎక్కడ కొనుగోలు చేయాలంటే
కోల్ కతా లో జరిగే ప్రారంభ మ్యాచ్ కు టికెట్లను బుక్ మై షో లో కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే టికెట్లను అందుబాటులో పెట్టారు. తొలి మ్యాచ్ కోల్ కతా, బెంగళూరు మధ్య జరుగుతుంది.. ప్రారంభ వేడుకలు సాయంత్రం 6 గంటలకు మొదలవుతాయి.. ప్రారంభ మ్యాచ్ ను చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులను సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల నుంచి మైదానంలోకి అనుమతిస్తారు. తొలి మ్యాచ్ చూసే ప్రేక్షకులకు దిశా పటానీ డాన్సులు, శ్రేయ పాటలు చూసే అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది ప్రారంభ మ్యాచ్ లో పోటీపడే కోల్ కతా, బెంగళూరు.. గత సీజన్లో రెండుసార్లు పోటీపడ్డాయి. తొలి మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో ఒక పరుగు తేడాతో పరాజయం పాలయింది. కోల్ కతా గత సీజన్లో విజేతగా నిలిచింది. గత సీజన్లో రెండుసార్లు ఓడిపోయిన నేపథ్యంలో.. ఈసారి కోల్ కతా పై ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. కోల్ కతా జట్టు తో సమానంగా బెంగళూరు కనిపిస్తోంది. బెంగళూరు జట్టుకు ఈసారి రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా బెంగళూరు జట్టుకు ట్రోఫీ అందించాలని అతడు కృత నిశ్చయంతో ఉన్నాడు. బెంగళూరు కూడా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో బలంగా కనిపిస్తోంది. రెండు చెట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ప్రేక్షకులకు హై వోల్టేజ్ క్రికెట్ వినోదం లభించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి బెంగళూరు జట్టు గాయపడిన సింహం లాగా పోటీ పడడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బెంగళూరు జట్టు కూడా ఈసారి కప్పు సొంతం చేసుకుంటామని ప్రకటనలు గుప్పిస్తోంది. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇప్పటివరకు 17 ఎడిషన్ పూర్తయినప్పటికీ.. బెంగళూరు జట్టు కప్ సొంతం చేసుకోకపోవడం గమనార్ధం. మరి ఈ సీజన్లోనైనా విజేతగా నిలుస్తుందో? లేదో? చూడాల్సి ఉంది.