Funny Video : ‘నా మొగుడు ఎక్కడికెళ్లాడు’.. ఈ పిల్ల లొల్లి వీడియో వైరల్

ఇంత చిన్న అమ్మాయికి ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఎవరో ఇలా అనుకుంటుండగా..

Written By: NARESH, Updated On : September 19, 2023 12:05 pm
Follow us on

Funny Video : ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడి వేరే ఉంటుంది. వాళ్ళు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒక్కోసారి మనం చెప్పిన దానికంటే వారి మనసులో నుంచి వచ్చిన ఆలోచనలతో విచిత్ర పనులు చేస్తాయి. వీటిని చూసిన తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అంతేకాకుండా కొందరు వారి స్థాయికి మించి మాట్లాడుతుంటారు. ఇవి ఎదుటివారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సోషల్ మీడియా వచ్చాక చిన్న పిల్లలకు సంబంధించిన ఇలాంటి వీడియోలను తీసి అప్లోడ్ చేస్తున్నారు. వీరు చేసే అల్లరి చాలా మందిని ఇంప్రెస్ చేయడంతో తెగ లైక్స్ కొడుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు ట్రెండీగా మారుతూ ఉంటాయి. లేటెస్టుగా ఓ వీడియోలో ఒక అమ్మాయి మారం చేస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఎంత బుజ్జగించినా వినడం లేదు. ఇంతకీ ఆమెకు ఏం కావాలని అడుగుతుందో తెలుసా?

సాధారణంగా చిన్న పిల్లలు ఆకలేస్తే.. లేదా ఏదైనా బొమ్మ కావాలని ఏడుస్తారు. ఆకలిని తీర్చడానికి వారికి ఏదైనా ఫుడ్ పెట్టి వారి ఏడుపు ఆపుతారు. ఒక వారు కోరిన బొమ్మ కోసం చిందులు వేస్తారు. సమయానికి ఆ బొమ్మ లేకపోతే ఏదో ఒకటి చెప్పి బుజ్జగిస్తారు. కానీ అస్సలు వినకపోతే చేసేదేమీ లేక బొమ్మలను తీసుకొచ్చి ఏడుపు ఆపించేస్తారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తనకు బొమ్మ కావాలని అడగడం లేదు.. అలాగని ఆకలేసి మారం చేయడం లేదు. ఇంతకీ ఏం కావాలని అడుగుతుందంటే..

తన వయసు చిన్నది.. కానీ కోరిక పెద్దది.. ఈ వయసులో నే తనకు మొగుడు కావాలట. రెండు జడలు వేసుకుని కూర్చొని ఏడుస్తున్న ఈ పాప ‘ నా భర్త కనిపించడం లేదు.. అత్త మామలు కనిపించడం లేదు.. నా పిల్లలు ఎక్కడా’ అని ఏడుస్తుంది. కాసేపు ఆగుతూ.. ‘నా భర్త ఎక్కడికి వెళ్లాడు? అని మళ్లీ ఏడవసాగింది. కాసేపు ఆగుతూ.. ఆ తరువాత బిగ్గరగా ఏడుస్తుంది. దీంతో ఆమె తల్లి బుజ్జగించే ప్రయత్నం చేసింది. చిన్న పిల్లలకు చెల్లెళ్లు, అక్కలు, అన్నలు ఉంటారు. పిల్లలు ఉండరు.. అని చెప్పింది.

ఈ వీడియోను చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంత చిన్న అమ్మాయికి ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఎవరో ఇలా అనుకుంటుండగా.. ఆమె గుర్తించి ఇలా అంటోందని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ వీడియో వైరల్ గా మారింది.