HomeతెలంగాణNagarjuna Yadav: రేవంత్ సైలెంట్ గా ఉంటాడనుకున్నాడు.. పాపం నాగార్జున యాదవ్.. ఈ ట్రీట్మెంట్ ఊహించలేదు..

Nagarjuna Yadav: రేవంత్ సైలెంట్ గా ఉంటాడనుకున్నాడు.. పాపం నాగార్జున యాదవ్.. ఈ ట్రీట్మెంట్ ఊహించలేదు..

Nagarjuna Yadav: నరం లేని నాలుక 40 విధాలుగా మాట్లాడుతుంది అంటారు. కాకపోతే అలా మాట్లాడుతున్నప్పుడు కాస్త నాలుగ మీద హద్దు పెట్టుకోవాలి. నాలుకను నియంత్రణలో ఉంచుకోవాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. పాపం ఇప్పుడు ఇది వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కు మాంచి అనుభవంలోకి వచ్చింది.

నాగార్జున యాదవ్ కాస్త అతిగా మాట్లాడుతాడు. ఆయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే నాయకుడు. వైసీపీ మాత్రమే గొప్ప పార్టీ. మిగతా పార్టీల నాయకులు ఉత్తి ఎదవలు. మిగతా పార్టీలు ఎందుకు పనికిరానివి. అయితే ఈ అభిప్రాయాలను నాగార్జున యాదవ్ తన మనసులో ఉంచుకుంటే సరిపోయేది. అలాకాకుండా బహిరంగంగా వ్యక్తం చేయడం.. అందులోనూ అతి ప్రదర్శించడంతో దూల తీరిపోయింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి జొమాటోబాయ్.. స్విగ్గి బాయ్ అంటూ లేకి కూతలు కోశాడు. పైగా జీవోలు కూడా చదవడం రాదంటూ తానేదో అపర మేధావిలాగా బిల్డప్ ఇచ్చాడు. సాక్షి న్యూస్ లో కొమ్మినేని శ్రీనివాసరావు వారిస్తున్నప్పటికీ నాగార్జున యాదవ్ తన నోటికి బ్రేక్ వెయ్యలేదు. అదేపనిగా రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయడం మొదలుపెట్టాడు.

నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించాయి. దీనికి తోడు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగార్జున యాదవ్ కు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే గుంటూరులో నాగార్జున యాదవ్ ఇంటికి నేరుగా వెళ్లిపోయారు. మఫ్టీ లో వెళ్లిన పోలీసులు ఎటువంటి అరెస్టు వారెంట్ చూపించకుండానే నాగర్జున యాదవ్ ను తమతో పాటు తీసుకెళ్లారు. తెలంగాణ పోలీసులు ఆకస్మాత్తుగా రావడంతో నాగార్జున యాదవ్ కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీసులు రావడం.. జరిగిన విషయం చెప్పడం.. ఆయనను తీసుకెళ్లడం ఇలా వెంట వెంటనే జరిగిపోయాయి. కనీసం నాగార్జున యాదవ్ అరెస్ట్ విషయంలో వైసిపి నోరు మెదపలేదు. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తుంది. దీనిని బట్టి అర్థమైంది ఏందంటే.. రేవంత్ తో జాగ్రత్త.. తిక్క తిక్కగా మాట్లాడితే తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. పాపం ఇప్పుడు నాగార్జున యాదవ్ కు ఇస్తున్న ట్రీట్మెంట్ ఒక రేంజ్ లో ఉందని గుసగుస.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version