Viral video : ఇక తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ (Chikoti praveen kumar) వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. తనకు పక్షవాతం సోకిందని..వైద్య సాయం కావాలని ఫోన్ లో సంప్రదించాడు. అతడి దుస్థితి చూసిన ప్రవీణ్ కుమార్ తన వద్దకు పిలిపించుకున్నాడు.. అతడి ఆరోగ్యం గురించి వాకబు చేశాడు. యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అయితే ఆ పక్షవాతం సోకిన వ్యక్తి తన వద్ద రైస్ పుల్లర్ ఉందని చికోటి ప్రవీణ్ కుమార్ కు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్ కుమార్.. ఆ వ్యక్తి బండారం బయటపెట్టేందుకు పూనుకున్నాడు. ఇందులో భాగంగానే యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. ఇక తన వద్ద రైస్ పుల్లర్ ఉందని చెప్పిన వ్యక్తి మీద చీకోటి ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయడానికి వీలు లేని బూతులతో రెచ్చిపోయాడు. లం****, చం** అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఇదే సమయంలో ఓ పోలీస్ అధికారికి ఫోన్ చేసి.. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. రైస్ పుల్లర్ అని ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక ఇదే వ్యవహారాన్ని సదరు యూట్యూబ్ ఛానల్ లో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. చికోటి ప్రవీణ్ వివాదాస్పదమైన వ్యక్తి కావడంతో.. ఈ వీడియోకు ప్రాధాన్యం ఏర్పడింది.
Also Read : సిల్వర్ జూబ్లీ సంబరం.. భార్యతో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో విమర్శలు
చికోటి ప్రవీణ్ కుమార్ ఈ ఉదంతాన్ని వెలుగులోకి తేవడంతో.. మరోసారి మీడియాలో ప్రముఖంగా కనిపించాడు. గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చికోటి ప్రవీణ్ కుమార్ కాసినో నిర్వహించారని ఆరోపణలు వినిపించాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో కూడా నిర్వహించిన కాసినో లో చికోటి ప్రవీణ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు సంక్రాంతి సందర్భంగా ఆయన గుడివాడలో ఉండడం చర్చకు దారి తీసింది. ఇక అంతకుముందు గోవాలో కూడా ప్రవీణ్ కుమార్ కాసినో నిర్వహించారనే విమర్శలు వినిపించాయి. ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు..” రైస్ పుల్లర్ ఉందని చెప్పిన వ్యక్తిని పోలీసులకు పట్టించడం వరకు బాగానే ఉంది. మరి మీరు నిర్వహించిన కాసినో పరిస్థితి ఏమిటి.. గోవాలో.. అంతకుముందు గుడివాడలో నిర్వహించిన జూదం, పేకాటను ఏమంటారు.. ముందు మీ కింద నలుపును చూసుకోండి. అంటే తప్ప మీరేదో దేశ ప్రయోజనం కోసం పని చేసినట్టు ప్రగల్బాలు పలకకండి అంటూ” నెటిజన్లు చికోటి ప్రవీణ్ కుమార్ పై మండిపడుతున్నారు. ” అక్రమంగా జంతువులను సాదుకోవడం.. విదేశాల నుంచి తెప్పించుకోవడం కూడా చట్ట వ్యతిరేకం అని తెలియదా. డబ్బుంది కాబట్టి మీరు ఏం చేసినా చెల్లిపోతుంది.. అదే ఆ వ్యక్తి రైస్ పుల్లింగ్ అని చెప్పగానే మీకు ఎక్కడో కాలింది. అతడు మాత్రమే కాదు, మీరు కూడా నిందితుడే” అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : విమానం నడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్!