Viral Video: మన దేశంలో వివాహ వేడుక అంటే అందరికి ఇష్టమే. ఏంటా నడక పెళ్లి నడక అని వ్యంగ్యంగా చెబుతుంటారు. పెళ్లి అనే తంతుకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. మన జీవితంలో జరిగే వేడుకలో పెళ్లికే పెద్దపీట వేస్తుంటారు. పుట్టిన తేదీకి కూడా ఇవ్వని ఇంపార్టెంట్ వివాహానికి ఇవ్వడం తెలిసిందే. అలాంటి పెళ్లిని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా నిర్వహించుకుంటారు. కొందరు బ్రహ్మాండంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతుంటారు.

మరికొందరు ప్రత్యేకతగా జరుపుకుంటారు. ఇంకొందరైతే సాధారణంగా జరుపుకునేందుకు ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలో పెళ్లిని మాత్రం జీవితంలో ఎవర మరిచిపోకుండా ఉండేలా చేసుకోవడం మాత్రం ఆనవాయితే. ఈ క్రమంలో తీసే వీడియోలు, ఫొటోలకు కూడా కొందరు ఫిదా అవుతారు. వివాహ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకుని దాన్ని ఎప్పుడు నెమరు వేసుకోవడం చూస్తుంటాం.
వివాహ వేడుకలో దుమ్ము రేపే డాన్సులు ఉండటం సహజమే. అందరికి ఇష్టమైన విధంగా నృత్యం చేస్తూ అందరిని ఆకట్టుకుంటారు. ఇక్కడ పెళ్లిలో మాత్రం ఓ వదిన తన మరిది పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులేస్తూ సందడి చేసింది. పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరచింది. నూతన వధూవరులకు తన డ్యాన్సుతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అందాల వదిన వేసిన స్టెప్పులతో అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. కొత్త జంట పరవశం చెందింది. వచ్చిన వారందరు తమ ఫోన్లలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఇది ఎక్కడిదో మాత్రం వివరాలు తెలియరాలేదు. నెటిజన్లు అదరహో అంటూ కామెంట్లు పెట్టడం గమనార్హం.