
యాంకర్ శ్రీముఖి కరోనా లాక్ డౌన్ వేళ ఏం చేయాలో తెలియక కామెడీ యాప్ లలో తనదైన శైలిలో మగ, ఆడ కామెడీ వేశాలు వేసుకొని సందడి చేసింది. తాజాగా కొడుకుగా, తల్లిగా శ్రీముకి చేసిన కామెడీ వీడియోలు నవ్వులు పూయించాయి.
కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు తెలంగాణలో షూటింగ్ లు, సీరియళ్ల షూటింగ్, కార్యక్రమాలవన్నీ రద్దయ్యాయి. దీంతో చాలా మంది సెలబ్రెటీలు ఇంటిపట్టునే ఉంటున్నారు.తమకిష్టమైన వ్యాపకాల్లో కనిపిస్తున్నారు.
తాజాగా శ్రీముఖి ‘స్నాప్ చాట్’ యాప్ లో వింతగా మారిపోయిన రూపంలో వీడియోలు చేసి షేర్ చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి.
శ్రీముఖి ప్రస్తుతం పలు సీరియళ్లు, కొన్ని సినిమాల్లో నటిస్తోంది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇంట్లో ఖాళీగా ఉండడంతో ఇలాంటి వెరైటీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది.