ఎన్నికల నిర్వహణకు సీఈసీ గ్రీన్ సిగ్నల్?

  వచ్చే ఏడాది ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ తో పాటు మరో మూడు రాష్ర్టాల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు సీఈసీ కసరత్తు చేస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ఓ సవాలేనని చెప్పుకోవాలి. బిహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ర్టాల్లో విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం ఈసారి కూడా అదే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం […]

Written By: Srinivas, Updated On : June 1, 2021 10:14 pm
Follow us on

 

వచ్చే ఏడాది ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ తో పాటు మరో మూడు రాష్ర్టాల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు సీఈసీ కసరత్తు చేస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ఓ సవాలేనని చెప్పుకోవాలి. బిహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ర్టాల్లో విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం ఈసారి కూడా అదే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ కరోనా మహమ్మారిని దాటుకుని ఎన్నికలు నిర్వహించడమంటే ఓ సవాలేనని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్రా వెల్లడించారు. ఇప్పటికి వైరస్ తగ్గుముఖం పడుతున్నా త్వరలోనే మహమ్మారి ప్రభావం ముగిసిపోతుందని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది ఐదు రాష్ర్టాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా నిర్వహిస్తామని చెప్పారు.

దేశంలో కరో నా వైరస్ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఐదు రాష్ర్టాల్లో వివిధ దశల్లో పోలింగ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. వైరస్ తీవ్రత పెరుగుతున్నా పశ్చిమ బెంగాల్ లో 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ర్టాలకు మార్చి 2022లో అసెంబ్లీ కాలవ్యవధి ముగుస్తుండగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉండగా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సీఈసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.