మరోసారి ఎద అందాలతో కుర్రకారు వైపు ఓర చూపులతో చూసింది జాన్వీకపూర్. ఈ
‘అతిలోక సుందరి శ్రీదేవి’ ముద్దుల కూతురికి ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఉండడంతో సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. షూటింగ్ లు లేక సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, మొదటి నుండి జాన్వీ కపూర్ తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఫస్ట్ సినిమా ‘ధడక్’ సినిమాతో పాస్ మార్కులే తెచ్చుకున్నా.. ఆ మార్కులతో సంబంధం లేకుండా ఆ తరువాత గ్లామర్ ప్రపంచంలో తానూ ఓ తారలా మెరిసిపోవడం అలవాటు చేసుకుంది.
ఇక ప్రస్తుతం జాన్వీ చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. పైగా సినిమాలతో పాటు మధ్యమధ్యలో యాడ్స్ కూడా చేసుకుంటూ మొత్తానికి రెండు చేతులా సంపాదిస్తోంది. ఒక విధంగా అప్పుల్లో ఉన్న బోణి కపూర్ ను ఆదుకుంటుంది కూడా జాన్వీనేనట. అన్నట్టు తానూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ హాట్ ఫోటో షూట్లు చేయడం మాత్రం జాన్వీ అసలు మానుకోదు. ఎలాగూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి,
తన హాట్ ఫోటోలను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ సోషల్ మీడియా నుండి కూడా బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం తన ఎద అందాలు చూపిస్తూ ఓరగా కైపు ఎక్కించేలా జాన్వీ చూస్తున్న చూపులకు కుర్రకారు బౌల్డ్ అవుతున్నారు. ఆమె హాట్ ఫొటోకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ‘రూహి అఫ్జానా’.. ‘దోస్తానా 2’ చిత్రాలలో నటిస్తోంది. అలాగే ఆమె చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.