కరణం మల్లీశ్వరి పాయే.. కుంబ్లేను జగన్ తెస్తున్నాడా?

దేశ రాజధాని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మన తెలుగు క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి ఇటీవల వైస్ చాన్స్ లర్ అయ్యింది. అదే పని ఏపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదని విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ ను టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే కలిశారు. ఈ క్రమంలోనే తెలుగు బిడ్డలను కాదని.. అనిల్ కుంబ్లేకు ఏపీ యూనివర్సిటీ వీసీ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈరోజు అనిల్ కుంబ్లే అమరావతికి వచ్చి మరీ […]

Written By: NARESH, Updated On : July 5, 2021 8:43 pm
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మన తెలుగు క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి ఇటీవల వైస్ చాన్స్ లర్ అయ్యింది. అదే పని ఏపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదని విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ ను టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే కలిశారు. ఈ క్రమంలోనే తెలుగు బిడ్డలను కాదని.. అనిల్ కుంబ్లేకు ఏపీ యూనివర్సిటీ వీసీ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈరోజు అనిల్ కుంబ్లే అమరావతికి వచ్చి మరీ ఏపీ సీఎం జగన్ తో భేటి అయ్యారు. ఏపీలో అసలు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందని కానీ.. పెట్టే ఆలోచనలో కానీ జగన్ ఉన్నారని తెలియదు. కానీ కుంబ్లే వచ్చి కలిసి వెళ్లాక జగన్ ఈ స్పోర్ట్స్ వర్సిటీ కోసమే పిలిపించారని.. కుంబ్లే పెడితే సహకరిస్తామని తెలిపినట్లుగా ప్రచారం సాగుతోంది.

అనిల్ కుంబ్లే తాజాగా సీఎంను కలిసి ఏపీలో స్పోర్ట్స్ వర్సిటీ పెడితే సహకరిస్తానని.. క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టీరిని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని జగన్ ను కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం జలంధర్, మీరట్ లో మాత్రం క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీలున్నాయని ఏపీలో పెడితే దక్షిణాది రాష్ట్రాలకు అనువుగా ఉంటుందని సీఎంకు కుంబ్లే వివరించాడని తెలుస్తోంది.

ఈ మేరకు కుంబ్లేకు జగన్ హామీ ఇచ్చారని త్వరలోనే ఏపీలో స్పోర్ట్స్ వర్సిటీ వీసీగా అనిల్ కుంబ్లేను నియమించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అనిల్ కుంబ్లే వచ్చిన కారణం ఇదేనని అంటున్నారు.

అయితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతుందా? అంత ఖర్చు చేస్తుందా? అన్నది అనుమానంగా మారింది.