Viral News: ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని ఓ సినీకవి రాశాడు. అది నూటికి నూరు శాతం నిజం. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం. సందర్భం, సమయానుసారంగా బయటపడుతుంటాయి. అలాంటి టాలెంటే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ సైలెన్సర్‌ను బుసకొట్టే నాగులా తయారు చేశాడు ఓ క్రియేటర్.
సైలెన్సర్లపై అనేక ప్రయోగాలు..
సైలెన్సర్లపై యువత అనేక ప్రయోగాలు చేస్తోంది. డిఫరెంట్ సైండ్ కోసం కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు కాకుండా.. తమకు నచ్చిన సైలెన్సర్లను బిగిస్తుంటారు. అలా రైయ్.. రయ్ మంటూ రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు. అయితే ఇలాంటి సైలెన్సర్లతో సౌండ్ పొల్యూషన్ పెరుగుతోందని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి.
బుసకొట్టే సైలెన్సర్..
ఇక్కడ ఓ యువకుడు అందరిలా ఉంటే కొత్తదనం ఏముంటుందనుకున్నాడు. వెరైటీ కోసం తన బైక్‌పై ప్రయోగం చేశాడు. స్వయంగా మెకానిక్ అయిన ఆ యువకుడు తన బైక్‌కు నాడుపాము తరహాలో ఓ గొట్టం బిగించాడు. బైక్‌తో వచ్చిన సైలెన్సర్‌కే దీనిని అదనంగా అమర్చాడు. చూడగానే అంతా స్టైల్ కోసం అమర్చాడనుకుంటాం. కానీ.. స్టైల్‌తోపాటు సౌండ్ కూడా మారింది. ఆ బైక్ స్టార్ చేయగానే బైక్ సౌండ్ కాకుండా పాము బుస కొడుతున్న శద్దం వస్తోంది.
నెట్టింట్లో వైరల్..
ఈ బుసకొట్టే సైలెన్సర్ బైక్ ఫొటో ఇపుపడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని తయారు చేసిన యువకుడిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు టాలెంట్‌ను ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. సూపర్ బ్రో.. యు ఆర్ క్రియేటర్.. నీ పేరు నాగరాజా… కాటేసే సైలెన్సర్ కూడా క్రికేట్ చేయ్.. అంటూ కొందరు కామెంట్ పెడుతుండగా.. మరికొందరు ఏమి రోగం.. ఎందుకీ ప్రయోగాలు.. ఈ తెలివి చదువుపై పెట్టండి.. అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.