https://oktelugu.com/

SS Rajamouli – Memes: మనువడు, మనువరాలితో ‘మహాభారతం’ చూడాలా.. రాజమౌళి..? జక్కన్న కామెంట్స్ పై మీమ్స్ వైరల్..

రాజమౌళి మహాభారతం 10 పార్టులు ఉంటుందని సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేప్యంలో జక్కన్న ఒక్క సినిమా తీయడానికే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. పౌరాణిక చిత్రమైన మహాభారతం మూవీ ఒక్కో పార్టు తీయడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుందని సెటైర్ వేస్తున్నారు. ఇలా అన్ని పార్టులు పూర్తయ్యే సరికి 50 సంవత్సరాలు పడుతుందని మీమ్స్ తయారు చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2023 / 04:57 PM IST
    Follow us on

    SS Rajamouli – Memes: ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లను కదిలిస్తుందని ఒకప్పటి మాట.. ఒక్క మీమ్స్ స్టోరీ మొత్తం తెలుపుతుందనేది నేటి మాట.. అందుకే మీమ్స్ కు ఆదరణ పెరిగిపోతుంది. ఒక విషయం చెప్పాలంటే మొన్నటి వరకు పేజీలకు పేజీలు పేపర్లలో రాసేవారు. ఆ తరువాత కార్టూన్ల రూపంలో చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒక్క ఫొటోలో విషయాన్నంతా సెటైరికల్ గా చెప్పేస్తున్నారు. ఈ మీమ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు కామెడీగా.. మరోవైపు సీరియస్ గా.. ఎలాగైనా సెటైరికల్ గా విషయం మొత్తం ఒక్క డైలాగ్ లో చెప్పేస్తున్నారు.

    లేటేస్టుగా ఓ మీమ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ దిగ్గ దర్శకుడు రాజమౌళి సినిమాలు దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే తన సినిమా సక్సెస్ కావడానికి జక్కన్న రాత్రి పగలు లేకుండా శ్రమను ఖర్చు చేస్తుంటారు. తనతో పాటు నటులనూ కష్టపెట్టిస్తారు. వీటితో పాట టైం తీసుకుంటారు. టైం అంటే ఆర్నెల్లో, సంవత్సరమో కాదు.. కనీసం 2 సంవత్సరాలు. బాహుబలి పార్ట్ 1 సినిమా షూటింగ్ 2013 జూలై 6న ప్రారంభం అయింది. 2015 జూలై 10న దీనిని రిలీజ్ చేశారు. దీనిక సీక్వెన్స్ గా వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ 2015 డిసెంబర్ నెలలో ప్రారంభమై 28 ఏప్రిల్ 2017లో రిలీజ్ అయింది.

    అంటే జక్కన్న ఒక సినిమా తీయడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ఆయన లేటేస్టు మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ 2018లో మొదలు పెట్టారు. అయితే కరోనా తో ఈ సినిమా వాయిదా పడుతూ రావడంతో మరింత ఆలస్యమై చివరికి 24 మార్చి 2022లో థియేటర్లోకి తెచ్చారు. దీంతో జక్కన్న సినిమాలకు కమిట్ అయిన వారు మరోసినిమా కోసం సంత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తోంది.

    ఈ తరుణంలో రాజమౌళి మహాభారతం 10 పార్టులు ఉంటుందని సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేప్యంలో జక్కన్న ఒక్క సినిమా తీయడానికే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. పౌరాణిక చిత్రమైన మహాభారతం మూవీ ఒక్కో పార్టు తీయడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుందని సెటైర్ వేస్తున్నారు. ఇలా అన్ని పార్టులు పూర్తయ్యే సరికి 50 సంవత్సరాలు పడుతుందని మీమ్స్ తయారు చేస్తున్నారు. ఇందులో కొంచెం వాస్తవం కూడా ఉండడంతో సోషల్ మీడియా వీక్షకులు దీనిని ఫన్నీగా చూస్తు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.