https://oktelugu.com/

Mother Love Cat: ఈ పిల్లికి తల్లయ్యింది.. అమ్మా అని పిలిపించుకుంటోంది.. వైరల్ వీడియో

వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. క్యాట్ ను పెంచుకుంటున్న మహిళ వివరాలుతెలియలేదు గానీ.. ఆ పిల్లిని మాత్రం తన కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నానని చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2023 / 04:41 PM IST
    Follow us on

    Mother Love Cat: ఈ సృష్టిలో తల్లికి మంచిన దైవం లేదు.. అమ్మ ప్రేమ కన్నా స్వచ్ఛమైనది ఎక్కడా దొరకదు.. దేవడు అమ్మరూపంలో దర్శనమిస్తాడు.. అంటూ ఎన్నో స్లోగన్స్ చెబుతూ ఉంటారు. కానీ అమ్మను ఆదరించేవారు తక్కవే ఉన్నారని కొన్ని కథనాలు చూస్తే తెలుస్తోంది. తమ కడుపును మాడ్చుకొని బిడ్డ ఆకలితీర్చే తల్లులు ఎందరో ఉన్నారు.. కానీ తల్లుల కోసం కాస్త సమయం కేటాయించేవారు ఈరోజుల్లో కరువవుతున్నారు. కనీసం ఒక్కరోజైనా అమ్మ గురించి ఆలోచించండి.. అంటూ కొందరు మే 14న ‘మదర్స్ డే’ను ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ పిల్లిని కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుందో తల్లి.
    ఇన్ స్ట్రాగ్రామ్ లో మదర్స్ డే కు సంబంధించిన వీడియోలు,ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒకటి బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ మహిళ ఒక పిల్లితో కనిపించింది. సాధారణంగా పిల్లులు మ్యావ్.. అంటూ అరుస్తాయి. కానీ ఈ క్యాట్ మిగతా వాటికంటే భిన్నంగా ఉంది. మ్యావ్ కు బదులు.. మామ్ అంటోంది. అంటే పిల్లి పిలుపు మారలేదు గానీ.. అంతలా అర్థం వచ్చేలా ఆ మహిళపై తన ప్రేమను చూపుతోంది.  ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఆ క్యాట్ కు ఆమె ‘జగ్గు’ అని పేరు పెట్టింది.

    ఈరోజుల్లో ఆస్తులు, అంతస్తుల కోసం తల్లిదండ్రులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ వారిని చేరదీయాలంటే మాత్రం మనసు రావడం లేదు. ఈ సృష్టిలో మనుషుల్లో కన్న జంతువుల్లోనే ఎక్కువగా విశ్వాసం ఉంటుందని విన్నాం. కానీ ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. క్యాట్ ను పెంచుకుంటున్న మహిళ వివరాలుతెలియలేదు గానీ.. ఆ పిల్లిని మాత్రం తన కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నానని చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.