Arushi Agarwal: 10 లక్షల మంది నిరుద్యోగులకు దారి చూపిన దేవత..

టాలెంట్ డిక్రిప్ట్’ ద్వారా ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ సాప్ట్ వేర్ ప్లాట్ ఫార్మ్ లో హ్యాకథాన్ ద్వారా ఇంట్లో ఉంటూ వర్చువల్ స్కిల్ ను డెవలప్ చేసుకోవచ్చు.

Written By: Chai Muchhata, Updated On : May 14, 2023 5:18 pm
Follow us on

Arushi Agarwal: ప్రపంచం ఆర్థిక మాంద్యంలో చిక్కుకోవడంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఊడుతున్నాయి. కొత్తవారికి ఉద్యోగాలు దొరికే పరిస్థితి కరువవుతోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల పాలిట దేవత గామారింది ఓ యువతి. దేశంలోని 10 లక్షల మంది నిరుద్యోగులకు జాబ్ లను పెట్టించింది. చదువుకునే రోజుల్లోనే తనకు కోటి రూపాయల జీతంతో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ తృప్తినివ్వలేదు. ఇతరులకు ఉద్యోగాలను ఇవ్వడంలో ఉన్న తృప్తి మరెందులో లేదని నిర్ణయించుకుంది. అలా లక్షరూపాలయ పెట్టుబడిపెట్టి.. కోట్ల టర్నోవర్ కు తీసుకొచ్చిన తన కంపెనీ నుంచి 10 లక్షల మంది ఉద్యోగాలు పొందిన వారు దేశంలోనే కాకుండా విదేశాల్లో హాయీగా ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమైంది.

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఆరుషి అగర్వాల్ అనే యువతి చేసిన పనికి ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ప్రస్తుతం ఘజియాబాద్ జిల్లాలోని నెహ్రూనగర్ లో నివసిస్తున్న ఆమె చిన్న వయసులోనే కంపెనీ పెట్టిన యువతిగా పేరు తెచ్చుకున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆరుషి ఢిల్లీలో ఐఐటీ ఇంటర్నిషిప్ చేశారు. ఇలా చదువుతున్న రోజుల్లోనే ఆమెకు కోటి రూపాయల జీతంతో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించేంది. సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది.

2020 కరోనా సమయంలో ఆరుషి అగర్వాల్ ‘టాలెంట్ డిక్రిప్ట్’ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. దీనిని ప్రారంభించడానికి ఆమె కేవలం లక్ష రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టారు. క్యాంపస్ ప్లెస్మెంట్ లో సెలక్ట్ అవ్వని వారికి సహాయం చేసేలా ఒక సాప్ట్ వేర్ ను డెవలప్ చేశారు. దీని కోసం ఆమె కోడింగ్ నేర్చుకున్నారు. ఇలా నిరుద్యోగలు, సెలెక్టర్ అవ్వకుండా నిరాశ చెందిన వారికి ఆరుషి దేవతగా మారారు. వారందరికీ తన కంపెనీ ద్వారా ఉద్యోగాలు కల్పించింది.

‘టాలెంట్ డిక్రిప్ట్’ ద్వారా ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ సాప్ట్ వేర్ ప్లాట్ ఫార్మ్ లో హ్యాకథాన్ ద్వారా ఇంట్లో ఉంటూ వర్చువల్ స్కిల్ ను డెవలప్ చేసుకోవచ్చు. ఆ తరువాత కంపెనీ నిర్వహించే పరీక్షలో పాసయితే నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సి ఉంటుంది. చాలా యూనివర్సిటీలు ఈ సాప్ట్ వేర్ సేవలను పొందుతున్నాయి. స్కిల్ డెవలప్ చేసుకునే సమయంలో నేరుగానే పాల్గొనాలి. ఇతరుల సహాయం అస్సలు తీసుకోవద్దు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారు అమెరికా, జర్మనీ, సింగూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు.

దేశంలోని టాప్ కంపెనీల సరసన ‘టాలెంట్ డిక్రిప్ట్’ చేరింది. ఇటీవల ఆమె ఇండియన్ గవర్నమెంట్ నుంచి అవార్డు కూడా పొందారు. ప్రస్తుతం ఆమె కంపెనీ కార్యాలయం నోయిడాలో ఉంది. తన తాతయ్య ఓం ప్రకాశ్ గుప్తాను ఆరాధ్య దైవంగా భావించే ఈమె నేటి నిరుగ్యులకు ఆదర్శంగా మారుతుంది. టాలెంట్ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరడం పెద్ద విషయం కాదని ఆరుషి అగర్వాల్ నిరూపిస్తున్నారు.