కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సినిమాలు ఆగిపోయాయి. సీరియళ్ల షూటింగ్ నిలిచిపోయింది. దీంతో అందరూ ఇంటికే బందీ అయిపోయారు.
సెలబ్రెటీలు, సినీ ప్రముఖులు ఇంట్లోనే సేదతీరుతున్నాయి. అయితే ఎప్పుడూ బయట బిజీగా ఉండే వీరంతా ఇంట్లో ఉండేసరికి సహజంగా ఇంట్లో ఆడవాళ్ల చేతిలో బలైపోతున్నారు. ఇంట్లో టార్చర్ అనుభవించేస్తున్నారు.
యాంకర్ రవి సైతం తాను లాక్ డౌన్ లో ఇంట్లో బందీ అయిపోయానని.. ఇంట్లో బండ చాకిరీ చేస్తున్నానని ఒక వీడియోను షేర్ చేశాడు. ‘ఇంట్లో అన్ని పనులు చేస్తూ మగజాతి ఆణిముత్యం అనిపించుకుంటున్నాడు.
అంతేకాదు.. ‘వకీల్ సాబ్’లోని ‘మగువ.. మగువా’ అనే సాంగ్ ను పేరడీ చేసి.. ‘పురుషా.. పురుషా.. మగవాడంటే ఆడవాళ్లకు అలుసా’ అంటూ పాటను మిక్స్ చేసి ఇంట్లో ఇళ్లూ ఊడుస్తూ, కడుగుతూ.. బట్టలు ఉతుకుతూ.. పిల్లలను ఆడిస్తూ.. భార్యకు సేవలు చేస్తూ అష్టకష్టాలు పడుతున్న వీడియోను పంచుకున్నాడు. అదిప్పిడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.