ఆనందయ్య మందు మంచిదే

మచిలీపట్నంలో కోవిడ్-19 చికిత్స కోసం ఆయుర్వేద వైద్యుడు బొనిగె ఆనందయ్య ఇస్తున్న మందుపై సానుకూల ఫలితం వెలువడింది. ఆయన తయారు చేసిన మందు ప్రామాణికతపై ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు. దాని పనితీరును పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అందులో వాడుతున్న మూలికలపై ఆయుష్ కమిషనర్ రాములు పరీక్షలు నిర్వహించారు. ఆనందయ్య దగ్గర పనిచేసే వారితో సైతం మాట్లాడారు. మందును ఏ […]

Written By: Srinivas, Updated On : May 22, 2021 11:01 pm
Follow us on


మచిలీపట్నంలో కోవిడ్-19 చికిత్స కోసం ఆయుర్వేద వైద్యుడు బొనిగె ఆనందయ్య ఇస్తున్న మందుపై సానుకూల ఫలితం వెలువడింది. ఆయన తయారు చేసిన మందు ప్రామాణికతపై ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు. దాని పనితీరును పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అందులో వాడుతున్న మూలికలపై ఆయుష్ కమిషనర్ రాములు పరీక్షలు నిర్వహించారు. ఆనందయ్య దగ్గర పనిచేసే వారితో సైతం మాట్లాడారు. మందును ఏ విధంగా తయారు చేస్తారో పరిశీలిస్తామని చెప్పారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్ర్తీయంగానే ఉన్నాయని పేర్కొన్నారు.

ఆనందయ్య తయారు చేసే మందు విషయంలో పలువురి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలన తర్వాత వారితో మాట్లాడి సమన్వయం చేస్తామని కమిషనర్ తెలిపారు. మందే తయారీ అధ్యయనం తరువాత తుది నివేదిక రావడానికి వారం రోజులు పడుతుందన్నారు. అప్పటి దాకా ఎవరూ కృష్ణపట్నం వెళ్లొద్దని సూచించారు. ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ నివేదిక తర్వాత ప్రభుత్వం అనుమతిస్తుందని తర్వాతే మందు పంపిణీ ఉంటుందన్నారు.

కరోనా వైరస్ నిర్మూలనలో ఆనందయ్య అందించే ఆయుర్వేద మందుపై ఇప్పటికే ప్రజలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మందుపై శాస్ర్తీయ ఆధారాలు వెలువడితే ఇంకా బాధితులు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో జనాన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్యే అవుతుంది. దీంతో ఆయుర్వేద మందుపై అప్పుడే అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారిని తుద ముట్టించేందుకు ఆయుర్వేద మందు కనుగొనడం శుభ పరిణామమే. కానీ దాని పంపిణీపై ఇటు ప్రభుత్వం, పోలీసులకు సవాలుగా మారింది.

ఏది ఏమైనా కరోనా రక్కసి వ్యాప్తి తగ్గించడానికి ఆనందయ్య చేస్తున్న కృషి అభినందనీయమే. ఆయుర్వేద మందును వెలుగులోకి తేవడం ముదావహమే. అయితే పంపిణీ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రోజు ఎంత మందికి వేస్తారు? ఎలా వేస్తారు? అనే విషయాలపై స్పష్టత ఉండాలి. దీనికి ప్రభుత్వం పోలీసులు నిర్ణయం తీసుకోవాలి.