Raksha Bandhan 2023: అన్ని పండుగల్లో రక్షాబంధన్ పండుగకు ప్రత్యేకత ఉంది. ఇది అతి పెద్ద పండుగలలో ఒకటి. పంచాంగం ప్రకారం, రక్షాబంధన్ పండుగను ఏటా శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని రాఖీ, రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. రక్షాబంధన్ తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి, వారి నుదిటిపై బొట్టుపెట్టి, హారతి ఇస్తారు. రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందం, శ్రేయస్సు, సంపద, వైభవం, వారి సోదరుల ఐశ్వర్యం కోసం దేవుడిని ప్రార్థిస్తారు. రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగా సోదరికి సోదరులు బహుమతులు ఇవ్వటం ఆనవాయితీ. ఆమెను జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ రాఖీపౌర్ణమిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం అస్సలు జరుపుకోరట. వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజమే.. అందుకు బలమైన కారణం ఉందని అంటున్నారు అక్కడివారు.
60 గ్రామాలు పండుగకు దూరం..
యూపీలోని హార్పూర్ జిల్లా పరిధిలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షా బంధన్ జరుపుకోరట. అంటే, అందరిలా జరుపుకోరు. వారు జరుపుకునే విధానం పూర్తిగా వేరుగా ఉంటుందట.. దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ పండుగను పూర్తి భిన్నంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కర్రలకు రాఖీలు కడతారు. అందువల్ల పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి.
శాపం కారణంగా..
మీరట్‌లోని మరో గ్రామంలో మరో విధంగా రాఖీని జరుపుకుంటారు. మీరట్‌లోని సురానా అనే గ్రామంలో పూర్వకాలం శాపం కారణంగా అక్కడ రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్లో ప్రజలందరినీ చంపేశాడు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం బతికారు. ఎందుకంటే వారు ఆ రోజున ఊళ్లో లేరు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ల వారు అక్కడ నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు ప్రమాదవశాత్తు చూపు కోల్పోయాడట. దాంతో గ్రామంలో రాఖీపండను నిషేధించారు. 300 ఏళ్లుగా రాఖీ పండుగను బ్యాన్ చేశారు.. అప్పటి నుంచి అక్కడ రాఖీ అన్న మాట.
రాఖీ కట్టించుకుంటే బికారులైపోతామని..
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో బైనిపూర్ బాక్ గ్రామంలో రాఖీ పండుగ అస్సలు జరుపుకోరు. దీని వెనుక ఓ కారణం కూడా చెబుతారు. ఆ గ్రామంలో ఓ జమిందార్ ఉండేవాడట ఆయనకు కొడుకులు తప్ప కుమార్తెలు లేరు. ఓ ఏడాది రాఖీ పండుగ రోజు ఆ గ్రామంలో ఉన్న పేదింటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి రాణి కట్టించుకుని ఏం కావాలో కోరుకోమన్నారట. ఆ పేద అమ్మాయిలు ఏకంగా జమిందార్ ఆస్తి కావాలని అడిగడంతో ముందుగా మాటిచ్చిన జమిందార్ కుమారులు మాట తప్పకుండా మొత్తం వారిపేరుమీద రాసిచ్చేశారు. ఆ తర్వాత వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ స్థానికులు రాఖీ పండుగ జరుపుకోవడం మానేశారట.
పండుగ ప్రాణం తీసిందని..
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా గున్నార్ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో కూడా రాఖీ పండగ జరుపుకోరు. 20 ఏళ్ల క్రితం ఓ యువతి తన సోదరుడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటలకే ఆమె సోదరుడు చనిపోయాడు. రాఖీ పండుగ కారణంగా ఈ ఘోరం జరిగిందని నమ్మి ఈనాటికీ రాఖీ చేసుకోవటం లేదు. ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేసి కొంతకాలానికి మళ్లీ రాఖి జరుపుకున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Villages staying away from rakhi festival for the same reason for 300 years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com