Krishna- Vijaya Nirmala: ఆ రోజుల్లో నటులు కుటుంబ సభ్యుల వలె కలిసి ఉండేవారు. హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరూ తెలుగువారే ఉండేవారు. లేదంటే తమిళ నటులు చేసేవారు. ఏడాదికి ఒక స్టార్ హీరో పదికి పైగా చిత్రాలు చేసేవారు. దీంతో హీరోయిన్స్ రిపీట్ అవుతూ ఉండేవారు. ప్రస్తుతం ఒక హీరోయిన్ కెరీర్ మొత్తం మీద 50 సినిమాలు చేస్తే ఎక్కువ. అప్పట్లో రెండు మూడు ఏళ్లలో హీరోయిన్స్ యాభై సినిమాల్లో నటించేసేవారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ రోజుకు మూడు షిఫ్ట్స్ షూటింగ్స్ చేసేవారు. ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన ఘనత కృష్ణ సొంతం.

కృష్ణ కెరీర్ పీక్స్ లో ఉండగా కొందరు హీరోయిన్స్ తో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. జయప్రద, జయసుధ, శ్రీదేవితో రిపీటెడ్ గా సినిమాలు చేశారు. కృష్ణ-శ్రీదేవిలది మంచి కాంబినేషన్ వీరిద్దరూ కలిసి 30కి పైగా చిత్రాలు చేశారు. అయితే అత్యధికంగా కృష్ణ హీరోయిన్ జయప్రదతో చేశారు. వీరి కాంబినేషన్ లో 40 కి పైగా చిత్రాలు తెరకెక్కిన ట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో దర్శక నిర్మాతలు కృష్ణ-జయప్రదలను హీరో హీరోయిన్ గా ఎంచుకునేవారు.
కలిసొచ్చిన హీరోయిన్ కావడంతో కృష్ణ సైతం ఆమె పట్ల ఆసక్తి చూపించేవారట. ప్రతి సినిమాలో ఆమెనే హీరోయిన్ కావడంతో ఎప్పుడూ కలిసి ఉండేవారట. దీంతో జయప్రదపై తెలియని ఇష్టం కృష్ణకు ఏర్పడ్డాయట. తన సినిమాల్లో హీరోయిన్ గా జయప్రదనే తీసుకోవాలని ఆయన రికమెండ్ చేసేవారట. ఈ విషయాలు భార్య విజయనిర్మల వరకూ చేరాయట. దీంతో విజయనిర్మలకు జయప్రద అంటే కోపం, అసహనం ఏర్పడ్డాయట. ఎప్పుడైనా కలిసినా ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండేవారట. మాట్లాడుకునేవారు కాదట.

జయప్రదకు కృష్ణపై అభిమానం తప్పించి ఏమీ లేదని అర్థం చేసుకున్న విజయనిర్మల తర్వాత జయప్రదతో మంచిగా మాట్లాడటం చేశారట. ఆ విధంగా జయప్రద తాత్కాలిక అనుమానాలకు కారణమైందట. కృష్ణ-జయప్రద కాంబినేషన్ లో అనేక హిట్ చిత్రాలు వచ్చాయి. వాటిలో సింహాసనం చాలా ప్రత్యేకం. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సింహాసనం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సింహాసనం సినిమాలో పాటలు అప్పట్లో మారుమ్రోగాయి.