
Vijay Deverakonda- Rashmika Mandanna: విజయ్ దేవరకొండ-రష్మిక మందాన లవర్స్ అనే ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. వీరిద్దరూ కలిసి రెండు చిత్రాలు చేశారు. గీత గోవిందం మూవీ కోసం ఫస్ట్ టైం జతకట్టారు. ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది. అనంతరం డియర్ కామ్రేడ్ లో జంటగా నటించారు. డియర్ కామ్రేడ్ చిత్రం యావరేజ్ రిజల్ట్ అందుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం పీక్స్. లిప్ లాక్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించారు. అప్పటి నుండే ఇద్దరికీ లింక్ కుదిరిందని ఎఫైర్ నడుపుతున్నారనేది ప్రధాన వాదన. దీన్ని బలపరుస్తూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ముంబైలో పలుమార్లు డిన్నర్ డేట్స్ కి వెళుతూ రష్మిక, విజయ్ దేవరకొండ కెమెరా కంటికి చిక్కారు. రెండు సార్లు మాల్దీవ్స్ వెకేషన్ కలిసి ఎంజాయ్ చేశారు. ఇండియా నుండి వేరువేరుగా వెళ్లే విజయ్, రష్మిక అక్కడ మాత్రం ఒకే హోటల్ రూమ్ లో స్టే చేస్తారు. దానికి ఆధారాలు లభించాయి. మాల్దీవ్స్ హోటల్ రూమ్ నుండి రష్మిక అభిమానులతో ఆన్లైన్ చాట్ చేశారు. ఓ నెటిజన్ కి రష్మిక సమాధానం చెబుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నట్లు స్పష్టత వచ్చింది.
తాజాగా మరోసారి ఇదే తరహాలో బుక్ అయ్యారు. ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే కాగా విజయ్ దేవరకొండతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తుంది. రష్మిక బర్త్ డే విషెస్ చెప్పిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ పిక్ బ్యాక్ గ్రౌండ్ ఒకటే. అంటే వీరిద్దరూ ప్రస్తుతం ఒక చోటే ఉన్నారు. కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారని క్లారిటీ వచ్చింది.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒకరు ట్వీట్ వేశారు. రష్మిక-విజయ్ దేవరకొండ ఎఫైర్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. త్వరలో గుడ్ న్యూస్ వినే అవకాశం కలదంటూ కామెంట్ చేశారు. దీనిపై రష్మిక స్పందించడం విశేషం. అతిగా ఆలోచించవద్దు, అని ఆమె రిప్లై ఇచ్చారు. మరోసారి ఎఫైర్ వార్తలను ఖండించారు. వారి చర్యలను బట్టి డేటింగ్ లో ఉన్నారని క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ పదే పదే కాదని బుకాయిస్తున్నారు.
#RashmikaMandanna & #VijayDeverakonda On Dating It’s Clearly Proved… Yes but it was very Seriously 😳 #VijayDevarakonda Favourite Ring 💍 To #Rashmika Figure.. They Both are living in same house same Room.. Surely we can Hear great News 😀 @iamRashmika @TheDeverakonda pic.twitter.com/VotVtLUAr5
— South Digital Media (@SDM_official1) April 6, 2023