
Vidya Balan: కాస్టింగ్ కౌచ్ సమస్య ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాదు, ప్రతీ ఇండస్ట్రీ లో ఉండేవే.మన ఇండస్ట్రీ లో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా దారుణంగా ఉంటుంది.కొత్త హీరోయిన్స్ కి ఎలాగో ఇలాంటి తిప్పలు తప్పవు.ఇష్టం ఉన్నోళ్లు ఒప్పుకుంటారు,ఇష్టం లేని వాళ్ళు ఇండస్ట్రీ నుండే తప్పుకుంటారు.కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కి కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తుతున్నాయి అంటే ఇండస్ట్రీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ విషయం లో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తాయి అట.ఈమె బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే.మన సౌత్ లో ఈమె ఎలాంటి సినిమాలు చెయ్యకపోయినా ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా ద్వారా ఇక్కడ దబ్ అయ్యి అందరికీ సుపరిచితమైంది.ఆరోజుల్లో ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది.
అలా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి బాలీవుడ్ లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విద్యాబాలన్ ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీ గా గడుపుతుంది.ఇక రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘కొంత కాలం క్రితం ఒక ప్రముఖ బాలీవుడ్ టాప్ నిర్మాత నన్ను గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు, నాకు విషయం అర్థం అయ్యి రూమ్ లోకి అడుగుపెట్టిన తర్వాత డోర్ కి లాక్ చెయ్యడం, అలా చిన్నగా తెరిచిపెట్టాను.అతనికి భయం వేసి 5 నిముషాలు కూడా అక్కడ ఉండకుండా పారిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్.ఆమె మాట్లాడిన ఈ మాటలు విన్న తర్వాత అంత పెద్ద హీరోయిన్ విషయంలోనే ఇలా జరిగితే ఇక అప్పుడే ఇండస్ట్రీ కి కొత్తగా వచ్చిన హీరోయిన్స్ పరిస్థితి ఏమిటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.