https://oktelugu.com/

ED Notice: ఎమ్మెల్సీ కవితపై ఈటల హాట్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

MLC Kavitha – Etela Rajender తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పాత్ర.. ఈడీ నోటీసులు, మార్చి 11న ఏం జరుగుతోందన్న అంశంపైనే జరుగుతోంది. ఈ విషయంపై విపక్షనేతలు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై గతంలో టీఆర్‌ఎస్‌లో పనిచేసిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉన్నవారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఇందులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2023 / 05:12 PM IST
    Follow us on

    MLC Kavitha – Etela Rajender

    MLC Kavitha – Etela Rajender తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పాత్ర.. ఈడీ నోటీసులు, మార్చి 11న ఏం జరుగుతోందన్న అంశంపైనే జరుగుతోంది. ఈ విషయంపై విపక్షనేతలు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై గతంలో టీఆర్‌ఎస్‌లో పనిచేసిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉన్నవారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఇందులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న ఆయన తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు. దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఢిల్లీపై పడిందని విమర్శించారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ ప్రభుత్వం మారిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని ఈటల స్పష్టం చేశారు.

    గత మాటలు విస్మరించిన కేసీఆర్‌..
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈటల ఈసందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణలో ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతికి పాల్పడినా వదిలిపెట్టేది లేదన్నారు. చివరకు తన కొడుకైనా, కూతురైనా ఇందుకు అతీతులు కాదని చెప్పిన మాటలను గుర్తుచేశారు. తనపై ఆరోపణలు వచ్చినందుకే మంతి పదవి నుంచి బర‍్తరఫ్‌ చేసిన కేసీఆర్‌, ఇప్పుడు కవిత విషయంలో ఏం చేస్తున్నారో తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. తన వారికి ఒక న్యాయం మిగతా వారికి ఒకన్యాయం బీఆర్‌ఎస్‌ పార్టీకే వర్తిస్తుందని ఎద్దేవా చేశారు.

    కవిత పాత్ర దర్యాప్తులో తేలుతుంది..
    లిక్కర్‌ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు ఈటల. స్కాంలో ఉన్న వారికి శిక్ష తప్పదు. ఇక్కడ దోపిడీ చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్లి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలను కొనే సంస్కృతికి తెర తీసింది కేసీఆరే’ అంటూ కామెంట్స్‌ చేశారు. అసలు ఆమె చేసిన వ్యాపారం ఏమిటో, అది ఆమె చేయాలి‍్సందో లేదో తెలంగాణ ప్రజలే అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ అవినీతి ఆరోపణలు వస్తే తనకు బిడ్డ అయినా కొడుకు అయినా ఒక్కటే అన్న కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు.

    బీఆర్‌ఎస్‌లోకి వస్తే ఆహ్వానిస్తానన్న కవిత..
    ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం టీవీ చానెళ‍్లకు ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత, ఈటల రాజేందర్‌ అంశంపై మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు ఈటలపై ఎలాంటి కోపం లేదన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ తిరిగి బీజేపీలోకి వస్తే వ్యక్తిగతంగా ఆహ్వానిస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తగా మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స‍్పష్టం చేశారు. నాలుగు రోజులకే కవిత లిక్కర్‌ స్కాంపై మాట్లాడిన ఈటల కవిత పాత్రను దర్యాప్తు సంస్థలే నిర్ణయిస్తాయని చెప్పడం గమనార్హం.