https://oktelugu.com/

Kothagudem: ఇన్ స్టాగ్రామ్ లో రీల్ చేసింది.. ఈ వీడియోనే ఆమె చావుకు కారణమైంది..

భద్రాద్రిగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాజీవ్ నగర్ కు చెందిన అజ్మిర సింధు మహబూబాబాద్ లో అప్రెంటీస్ నర్సుగా పనిచేస్తుంది. అయితే ఈమె ఖాళీ సమయంలో ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉండేది. అయితే ఆమె ఒంటరిగా కాకుండా మరోవ్యక్తితో చేయడం ప్రారంభించింది. దీంతో ఈ వీడయోలను చూసిన సోదరుడు హరిలాల్ తట్టుకోలేకపోయాడు. దీంతో ఆమె చెల్లిని పిలిచి వారించాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 27, 2023 11:47 am
    Kothagudem

    Kothagudem

    Follow us on

    Kothagudem: సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది ఫోన్లతోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఏ సమయంలో టిక్ టాక్ ఎంట్రీ ఇచ్చిందో.. ప్రతి ఒక్కరు డ్యాన్స్, నటన, కామెడీ చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. దానిని బ్యాన్ చేసినా ‘రీల్స్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రాముల్లో స్పెషల్ వీడియోలు చేస్తున్నారు. అయితే సినిమాల్లో అవకాశాల కోసం లేదా జీవితంలో ఎదిగేందుకు అయితే పర్వాలేదు. అయితే కొంతమంది ఇదే అదనుగా చూసి హద్దు మీరుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇష్టమొచ్చినట్లు వీడియోలు తీయడంతో కుటుంబ సభ్యులు తలెత్తుకోలేకోతున్నారు. ఓ అమ్మాయి ఇలాంటి వీడియోలు చేయడాన్ని సహించలేక ఆమె సోదరుడు ఆమెను వారించాడు.. అయినా వినకపోవడంతో దాడి చేశాడు. కానీ ఈ దాడి ఎంతపనిచేసిందో తెలుసా?

    భద్రాద్రిగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాజీవ్ నగర్ కు చెందిన అజ్మిర సింధు మహబూబాబాద్ లో అప్రెంటీస్ నర్సుగా పనిచేస్తుంది. అయితే ఈమె ఖాళీ సమయంలో ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉండేది. అయితే ఆమె ఒంటరిగా కాకుండా మరోవ్యక్తితో చేయడం ప్రారంభించింది. దీంతో ఈ వీడయోలను చూసిన సోదరుడు హరిలాల్ తట్టుకోలేకపోయాడు. దీంతో ఆమె చెల్లిని పిలిచి వారించాడు. అయినా వినకపోవడంతో సోమవారం రాత్రి ఇల్లెందులో తల్లి సమక్షంలోచెల్లెతో గొడవపడ్డాడు. దీంతో కోపోద్రోక్తుడైన హరిలాల్ రోకలిబండతో తలపై బాదాడు. దీంతో సింధు అక్కడికక్కడమే మృతి చెందింది.

    అయితే హరిలాల్ సింధును హత్య చేసిన తరువాత హరిలాల్ పారిపోయినట్లు పోలీసులు తెలుపుతున్నారు. అయితే సింధు, మరోవ్యక్తితో కలిసి తీసిన ఓ వీడియోనే హత్యకు దారి తీసిందని ప్రచారం సాగుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా టాలెంట్ కు వేదిక కావాలని, అయితే హద్దు మీరితే ప్రాణాలకే ముప్పు అని తెలుపుతున్నారు.

    సోషల్ మీడియాలో సింధు మాత్రమే కాకుండా చాలా మంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. అయితే తమ టాలెంట్ ను ప్రదర్శించడానికి ఇది వేదిక కావాలని కానీ దీనిని అదనుగా తీసుకుంటే కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కుటుంబ అనుమతి తీసుకోవాలని, లేకుంటే చాలా ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని పోలీసలు సూచిస్తున్నారు.