Bengaluru Girls Fighting: అదో పెద్ద స్కూల్. పేరుగాంచిన ప్రముఖుల పిల్లలు చదివే చోటు. ఇందులో సీటు కోసమే తల్లిదండ్రులు తపస్సు చేసినంత పని చేస్తారనడంలో సందేహం లేదు. అందులో చేరాలంటే అదృష్టమే ఉండాలని చెబుతుంటారు. అలాంటి పాఠశాలలో ఓ చిన్న గొడవ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ పాఠశాల ప్రతిష్ట మసకబారినట్లు తెలుస్తోంది. ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నత స్థానాల్లో స్థిరపడిపోయారు. అంతటి చరిత్ర కలిగిన పాఠశాల కావడంతో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే స్కూల్లో ఓ గొడవ వివాదాన్ని సృష్టించింది.

బెంగుళూరులో పేరు ప్రతిష్టలు ఉన్న బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్లో శ్రీమంతుల పిల్లలు చదువుతుంటారు. దీంతో తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ప్రతి ఏడాది పిల్లల్ని స్కూల్ లో చేర్పించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇంతటి పేరు ప్రతిష్టలు ఉన్న పాఠశాలలో జరిగిన ఓ గొడవ కలకలం రేపుతోంది. బిషప్ కాటన్ స్కూల్ లో చదువుతున్న కొందరు విద్యార్థులు యూనిఫాం లోనే పాఠశాల ప్రాంగణం బయటకు వచ్చి జట్టుపట్టుకుని ముష్టి ఘాతుకాలకు పాల్పడటంతో అటుగా వెళ్లే వారు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడం గమనార్హం.
Also Read: Koratala Siva-NTR: ఎన్టీఆర్ తో రిస్క్ చెయ్యడానికి భయపడుతున్న కొరటాల శివ
ఇక్కడ చదువుతున్న అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఓ విద్యార్థి సాటి విద్యార్థి తల్లిని మెట్ల మీద నుంచి జట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లడంతో ఆ సన్నివేశాన్ని ఫోన్లలో వీడియోలు తీయడంతో వైరల్ అయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేరు ప్రతిష్టలు పొందిన స్కూల్లో ఇలాంటి ఘటన జరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రముఖుల పిల్లలు కావడంతో హుందాగా ఉంటారనే తెలిసినా ఇంత మాస్ గా జట్టు పట్టుకుని మరీ కొట్టుకోవడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ గొడవకు సంబంధించి పాఠశాల ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. మీడియాలో కూడా ప్రసారం కాలేదు. దీంతో బెంగుళూరులోని ఈ స్కూల్లో అమ్మాయిల మధ్య జరిగిన రచ్చ చర్చనీయాంశం అయింది. హాట్ టాపిక్ గా మారుతోంది. కానీ ఇంతవరకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు కూడా రాకపోవడం గమనార్హం. దీంతో దీనిపై పాఠశాల యాజమాన్యం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.
Also Read:Hereoine Laya: అందాల ఆరబోతకు ఆ అచ్చ తెలుగు నటి కూడా రెడీ !