https://oktelugu.com/

Mother’s love : అమ్మలేదు.. ఇకపై రాదు..పాపం ఆ చిన్ని ప్రాణి బాధ వర్ణనాతీతం.. వీడియో వైరల్

ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించింది లేదు. తల్లి వాత్సల్యాన్ని పోలింది మరొకటి లేదు. అందువల్లే "అమ్మ అనే పదం కమ్మని మాట.. అమ్మతో సాగించే పయనం మమతల తోట" అని పెద్దలంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2024 / 09:43 PM IST

    monkey

    Follow us on

    Mother’s love : కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా అమ్మ అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. అవి నోటితో మాట్లాడలేకపోయినప్పటికీ.. తమ భావాలను వ్యక్తం చేస్తాయి. తన బాధను, సంతోషాన్ని, ఆనందాన్ని, దుఃఖాన్ని తల్లితో పంచుకుంటాయి. చిరుతపులి నుంచి మొదలు పెడితే వానరం వరకు తల్లితోనే పయనం సాగిస్తాయి. వేట నుంచి మొదలుపెడితే చెట్లు ఎక్కి దూకడం వరకు ప్రతిదీ తల్లి ద్వారానే నేర్చుకుంటాయి. అందువల్లే తల్లితో విపరీతమైన బంధాన్ని పెనవేసుకుంటాయి. తండ్రి ఎవరో తెలియకపోయినా, తండ్రితో పెద్దగా సంబంధం లేకపోయినా.. తల్లితో మాత్రం అనుబంధాన్ని జంతువులు కొనసాగిస్తాయి. తల్లి దూరమైతే ఆ పిల్లలు తట్టుకోలేవు. గుండెలు పగిలే విధంగా ఏడుస్తాయి. దిక్కులు పిక్కటిల్లే విధంగా రోదిస్తాయి. ఆ సమయంలో అవి నిర్వేదంగా ఉంటాయి. నిరాశను ప్రదర్శిస్తుంటాయి. ఒకప్పుడు ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రతి విషయం కూడా వెంటనే తెలిసిపోతుంది. అలాంటి సంఘటన ఇది కూడా. సోషల్ మీడియాలో హృదయాలను ద్రవింపజేస్తున్న ఆ వీడియోలో ఓ కోతి చనిపోయింది. దానికి ఒక చిన్నారి కోతి ఉంది. తల్లి చనిపోయిన విషయం ఆ చిన్నారి కోతికి తెలియక.. దానిని అదే విధంగా పట్టుకుని ఉంది.. చనిపోయిన కోతిని ఖననం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ చిన్నారి కోతి అలాగే గట్టిగా తన తల్లి కోతిని పట్టుకొని ఉంది. ఇది గుండెలను ద్రవింపజేస్తోంది.

    ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఆ కోతి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి పారిశుద్ధ్య కార్మికులు ఆ తల్లి కోతిని ఖననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం పెద్ద గోతిని తవ్వారు. అలా చనిపోయిన కోతిని అందులో పెట్టి పూడ్చడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ చిన్నారి కోతి ఒప్పుకోవడం లేదు. పైగా తన తల్లి కోతిని అలాగే పట్టుకొని ఉంది. దీంతో ఆ పారిశుధ్య సిబ్బంది బలవంతం మీద చిన్నారి కోతిని తల్లి కోతి నుంచి విడదీశారు. ఆ తర్వాత తల్లి కోతిని ఆ గోతిలో పెట్టి మట్టి పూడ్చారు. తన తల్లిని అలా ఎందుకు చేస్తున్నారో ఆ చిన్నారి కోతికి తెలియ రాలేదు. దీంతో అది తన తల్లి కోసం వెతుకులాడింది. దాన్ని కప్పి పెట్టిన మట్టిని తొలగించడానికి ప్రయత్నించింది. ఈ దృశ్యాలను కొంతమంది సామాజిక మాధ్యమాలలో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. అది కాస్త చర్చనీయాంశంగా మారింది.” తల్లి అనేది ఎవరికైనా ఒక ఎమోషన్. తల్లి దూరమైతే పిల్లలు తట్టుకోలేరు. మనుషులు మాత్రమే కాదు జంతువుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకు పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేయకూడదు. జంతువుల విషయంలో కూడా మనుషులు కర్కశంగా ప్రవర్తించకూడదు. ఎలా జరిగిందో తెలియదు.. ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ తల్లి కొద్ది చనిపోయింది. దీంతో పిల్లకోతికి గుండెలు పగిలినంత పనైంది. ఇప్పుడు ఆ లోటు దానికి ఎవరు తీర్చుతారు. ఇది పూడ్చలేని బాధ” అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పటికే వేలల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో గుట్టలను ఇష్టానుసారంగా తవ్వుతున్న నేపథ్యంలో కోతులకు ఆవాసం కరువైంది. దీంతో అవి గ్రామాల మీదకి వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలకు కోల్పోతున్నాయి.