https://oktelugu.com/

Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ వెళ్లట్లేదు.. పైకి మేకపోతు గాంభీర్యం.. రద్దయితే ఆర్థికంగా నష్టం..పాపం పాక్ కష్టం ఎవరికీ రావద్దు..

కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది. ఆ సమయంలో పాకిస్తాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 11, 2024 / 10:02 PM IST
    Follow us on

    Champions Trophy 2025 :  ఈ పరిణామం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దీంతో అప్పటినుంచి మొన్నటిదాకా పాకిస్తాన్ లో ఏ క్రికెట్ జట్టూ పర్యటించలేదు. ఫలితంగా ఆ దేశంలో క్రికెట్ ఆశించినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ సాధించిన ఆ దేశం లో మైదానాలు చీకటి గుహలుగా మారిపోయాయి. ఆ తర్వాత అనేక సంవత్సరాలు అనంతరం తొలిసారిగా పాకిస్థాన్లో ఇంగ్లాండ్, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లు పర్యటించాయి. అయితే ఈ జాబితాలో భారత్ లేదు. ఇకపై ఉంటుందో లేదో కూడా తెలియదు. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి. చివరిసారిగా 2012-13లో భారత్ – పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ లో తలపడ్డాయి. ఆ సమయంలో భారత్ పాకిస్థాన్ లో పర్యటించింది. ఆ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారిపోవడంతో.. ఈ రెండు దేశాలు పరస్పరం తలపడలేదు. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో మాత్రమే భారత్ – పాకిస్తాన్ తలపడుతున్నాయి.. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో పాకిస్తాన్ భారత్ వస్తుంది గాని.. భారత్ మాత్రం పాకిస్తాన్ వెళ్లడం లేదు.

    పాపం పాకిస్తాన్

    త్వరలో పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వచ్చే ఏ డాది ఫిబ్రవరిలో ఈ టోర్నీ మొదలవుతుంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ టోర్నీ నిర్వహించడానికి అడుగులు పడుతున్న వేళ పాకిస్తాన్ దేశానికి వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ లో నిర్వహించే ఈ ట్రోఫీలో తాము ఆడబోమని బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. ఇదే విషయాన్ని ఐసీసీకి నివేదించింది. బిసిసిఐ పంపించిన మెయిల్ ను ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఫార్వర్డ్ చేసింది. దీంతో ఏం చేయాలో పాలు పోలేని పరిస్థితి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు దాపురించింది. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహిస్తే తాము ఆడతామని భారత్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. తాము ఆ విధానానికి ఒప్పుకునేది లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. ఒకవేళ ఈ టోర్నీ రద్దయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా నష్టం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ టోర్నీలో భారత్ ఆడకపోతే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై తీసుకుని నిర్ణయాన్ని ప్రభుత్వం చేతుల్లో పెట్టాలని పాకిస్తాన్ క్రికెట్ నిర్మించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనకు వచ్చిన మెయిల్ పై స్పందించింది..” ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి మాకు మెయిల్ వచ్చింది. భారత క్రికెట్ బోర్డు తమ జట్టును పంపించడం లేదని ఆ మెయిల్ సందేశం. దానిని మాకు ఐసీసీ పంపించింది. ఈ టోర్నీ మాకు అత్యంత ముఖ్యం. భారత్ మా దేశంలో ఆడితే సంతోషిస్తాం. అయితే పాక్ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మరోవైపు ఈ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తుంది. అయితే షెడ్యూలింగ్ పేరుతో ఐసీసీ దానిని రద్దు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ టోర్నీ రద్దు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్రంగా నష్టం వస్తుంది. అలాంటప్పుడు హైబ్రిడ్ మోడల్ లో భారత్ ఆడే మ్యాచ్ లు నిర్వహించడమే ఆ బోర్డు ముందున్న ఏకైక మార్గం. భారత్ ఆడే మ్యాచ్ లను షార్జా లేదా దుబాయ్ వేదికగా నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే భారత్ నిర్ణయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, ఇంజమాముల్ హక్ కూడా వ్యతిరేకించారు.. మెగా టోర్నీలను ఐసీసీ హాస్యాస్పదంగా మార్చిందని.. భారత జట్టు కోసం icc తన నిబంధనలను తుంగలో తొక్కిందని వ్యాఖ్యానించారు.