
Venu Swamy: సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడం, అందుకు తగిన విధంగా వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత. నాగచైతన్య – సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే నాలుగేళ్లు తిరగకముందే చైతు – సమంత విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవల టాలీవుడ్ లో త్వరలో ఒక యంగ్ హీరో, ఒక యంగ్ హీరోయిన్ చనిపోతారంటూ ఆయన రెండు నెలల కిందట వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పేరు అందరినోళ్లలో నానుతోంది. వేణుస్వామి వ్యక్తిగత జీవితం తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఆయన విద్యార్హత, కుటుంబ నేపథ్యం, భార్య పిల్లల గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇంత ఆధ్యాత్మికత ఉన్న వేణుస్వామి ఓ పబ్ ఓనర్ అనే విషయం చాలామందికి తెలియదు.
హైదరాబాద్‌లో పబ్..
వేణుస్వామి పక్కా బ్రాహ్మణుడు. కానీ, మిగతా బ్రాహ్మణులతో పోలిస్తే ఆయన ఆహార్యం భిన్నంగా ఉంటుంది. నూటికి 90 మంది బ్రాహ్మణులు పంచెకట్టు, భుజంపై కండువాతో కనిపిస్తారు. కానీ వేణుస్వామి సాధారణంగా ప్యాంటు చొక్కా వేసుకుంటారు. బ్రాహ్మణుల్లో చాలామంది శివారాధన, వైష్ణవారాధన చేస్తారు. అయితే వేణుస్వామి మాత్రం కామాఖ్యదేవిని ఆరాధిస్తారు. తెలుగా రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ఆయన పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ వేణుస్వామి హైదరాబాద్‌లో ఓ పబ్‌కు ఓనర్. నలుగురు వ్యక్తులు భాగస్వామ్యంతో కలిసి పబ్ ఏర్పాటు చేశారు. ఇందులో వేణుస్వామి ఒకరు.
ఏదో వ్యాపారం ఉండాలని..
వేణుస్వామి ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఓ పబ్ ఓనర్ అన్న విషయం బయట పెట్టారు. నవంబర్ 20న దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే పబ్ ప్రారంభోత్సవం రోజే తాను అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. ఆరోజు ఆస్ట్రేలియాలో ఉన్నట్లు తెలిపారు.

బ్రాహ్మణుడు ఇలాగే ఉండాలంటే..
సాధారణంగా బ్రాహ్మణుడు అనగానే పూజ, జపం, సుచీ, శుభ్రత అని మనందరికీ తెలుసు. అయితే కొంతమంది మాంసం తినడం, మద్యం తాగడం, సెక్స్ చేయడంపైనా వేణుస్వామి స్పందించారు. సుచీ శుభ్రత, పూజలు అనగానే దక్షణాచారమని, తాను పాటించేంది వామనాచారం అని స్పష్టం చేశారు. ఆచార వ్యవహారాలు ప్రాంతాలను బట్టి ఉంటాయని తెలిపారు. తెలంగాణలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాల వద్ద కోళ్లు మేకలు బలి ఇవ్వడం ఉంటుందని తెలిపారు. ఆంధ్రా ప్రాంతానికి వెళితే అక్కడ ఇలాంటి ఆచారం కనిపించదని తెలిపారు. తెలంగాణలో బోనాలకు సబంధించిన కూడా మద్యం, మాసం తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఆషాఢమాసంతో వచ్చే తొలి ఏకాదశి రోజు తెలంగాణలో ప్రతీ ఇంట్లో మాంసం ఉంటుందని కూడా తెలిపారు. తాను చెప్పేవన్నీ శాస్త్రప్రకారమే చెబుతున్నానని, సొంతంగా ఏదీ చెప్పడం లేదని స్పష్టం చెప్పారు. తనకు వ్యక్తిగతంగా మందు తాగాలని, మాంసం తినాలనే సోకులేదని స్పష్టం చేశారు. ఇంత ఓపెన్‌గా ఎందుకు చెబుతానని ప్రశ్నించారు.