Veera Simha Reddy: ” మా బాలయ్య గొప్పోడు.. కత్తి ఎత్తాడంటే ఊచకోతే.. స్క్రీన్ నిండా రక్తం పారిస్తాడు. ఆయన సినిమాలు అలానే ఉంటాయి.. అలాంటి సినిమాలు తీయడం ఆయన ధర్మం.. నచ్చకపోవడం మీ ఖర్మం” నిన్నటి నుంచి ఇలా ఉంటున్నది బాలయ్య అభిమానుల సూత్రీకరణ. మైకు పట్టుకుని ఎవరైనా కనిపిస్తే చాలు వీర లెవెల్లో రెచ్చిపోతున్నారు.. స్క్రీన్ మీద బాలయ్య, స్క్రీన్ కింద అభిమానులు.. ఇక దబిడి దిబిడే. అది ఐమాక్స్ కావచ్చు… వర్జినియా కావచ్చు.

నిన్నటి నుంచి
సాధారణంగా బాలకృష్ణ సినిమాలు ఊర మాస్ కథతో నిర్మితమవుతూ ఉంటాయి. అందులో తర్కానికి విలువ ఉండదు.. కేవలం ఫైట్లు, తెర నిండా రక్తం, బీభత్సమైన ఎలివేషన్లు… అంతే అంతకుమించి ఆశించడం కూడా దండగ.. కొత్తదనం భూతద్దం పెట్టి వెతికినా ఇసుమంత కూడా కనిపించదు.. ఇక ఆయన డై హార్డ్ కోర్ అభిమానుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. నిన్న అమెరికాలో వీర సింహారెడ్డి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఆయన అభిమానులు చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో థియేటర్ యాజమాన్యం షో ను నిలిపివేసింది.

సోషల్ మీడియాలో ట్రోల్
బాలయ్య అభిమానులు చేస్తున్న వీరంగం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అమెరికా దేశంలో వీర సింహారెడ్డి గెటప్ లో, కత్తులు పట్టుకుని ఆయన అభిమానులు చేసిన హంగామా పిక్స్ కు వెళ్ళిపోతున్నది. మరోవైపు కొందరు అభిమానులు మద్యం తాగారా అనే అనుమానాన్ని కలిగిస్తున్నారు. ఎందుకంటే సినిమా బాగోలేదని ఎవరైనా చెప్పినా.. వారిపై దూసుకెళ్తున్నారు.. ఓ అభిమాని అయితే కూల్ డ్రింక్ సీసా పట్టుకుని దాడి చేసేందుకు వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది.