Veera Simha Reddy Collections: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన వీరసింహా రెడ్డి నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ ఓపెనింగ్ ని దక్కించుకుంది..గడిచిన 20 ఏళ్ళల్లో బాలయ్య బాబు కి ఇలాంటి ఓపెనింగ్ ఎప్పుడూ కూడా రాలేదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు..అఖండ చిత్రానికి ముందు బాలయ్య బాబు మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ‘వీర సింహా రెడ్డి’ మొదటి రోజు వసూళ్ల రేంజ్ లో ఉండేవి కాదని అంటున్నారు.

కొన్ని ప్రాంతాలలో అయితే ఈ సినిమా #RRR తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా నిలిచింది..మరీ ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం లో అయితే ఈ చిత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ ని కొట్టాలంటే మళ్ళీ నందమూరి సినిమానే రావాలి అనే రేంజ్ లో ‘వీర సింహా రెడ్డి’ ఓపెనింగ్ వచ్చింది..ఇక బాలయ్య కి వీక్ జోన్స్ గా చెప్పుకునే నైజాం మరియు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్ కొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు..బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ కి ఏ రేంజ్ బ్యాంగ్ వేశాడో అనేది.
ముఖంగా సీడెడ్ ప్రాంతం లో ఈ సినిమా ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు..నైజం ప్రాంతం లో కూడా ఇంచు మించు అదే రేంజ్ వసూళ్లను రాబట్టాడు..తూర్పు గోదావరి జిల్లాలో కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

ఇక నందమూరి సినిమాలకు కంచుకోటలాగా ఉండే గుంటూరు జిల్లాలో ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా మూడు కోట్ల నలభై లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..అలాగే నెల్లూరు జిల్లాలో కోటి 20 లక్షల రూపాయిలు , ఉత్తరాంధ్ర లో రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు వసూలు చేసింది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 22 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టగా ప్రపంచవ్యాపంగా వచ్చిన వసూళ్లను చూస్తే 32 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.