Ramya Raghupathi: నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. నరేష్ భార్యగా తన జీవితంలో జరిగిన సంఘటనలు బయటపెడుతున్నారు. నరేష్ పై ఆమె సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. నరేష్ ని రమ్య క్యారెక్టర్ లెస్ వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. నరేష్ ని ఉద్దేశిస్తూ రమ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాగా నరేష్ తల్లిగారైన విజయనిర్మల గురించి రమ్య తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఊహించని విధంగా విజయనిర్మల చాలా మంచివారని ఆమె చెప్పుకొచ్చారు.

విజయనిర్మల గొప్ప వ్యక్తి. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఏనాడూ నన్ను కోడలిగా చూడలేదు. కన్నకూతురి వలె ఆదరించారు. నేను కూడా అత్తయ్య అనేదాన్ని కాదు. అమ్మ అని పిలిచేదాన్ని. ఆమె,నేను కూర్చొని గంటల తరబడి అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. నాకు కొడుకు పుట్టినప్పుడు విజయనిర్మల చాలా సంతోషించారు. నా బిడ్డను ఎత్తుకొని రోజూ ఆడించేవారు. ఆమె అకాల మరణం పొందడం దురదృష్టకరం. విజయనిర్మల బ్రతికుంటే బాగుండేది. నాకు ఈ దుస్థితి వచ్చేది కాదని రమ్య వెల్లడించారు.
విజయనిర్మల 2019లో అకాల మరణం పొందారు. గుండెపోటుతో విజయనిర్మల కన్నుమూశారు. ఆమె బ్రతికి ఉన్నప్పటికే నరేష్ తో రమ్య రఘుపతి విడిపోయారు. ఎందుకంటే నరేష్-రమ్య విడిపోయి ఐదేళ్లు దాటిపోతుంది. కృష్ణ-విజయనిర్మల అనుక్షణం కలిసి ఉండేవారు. నరేష్ ఇంట్లోనే విజయనిర్మల ఉండేవారు. దీంతో విజయనిర్మల-కృష్ణలతో రమ్య రఘుపతికి అనుబంధం ఉంది. నరేష్, రమ్య, కృష్ణ, విజయనిర్మల ఒకే ఇంట్లో ఉండటం వలన వారి కోడలిగా రమ్య అనుబంధం పెంచుకున్నారు.

2022 నవంబర్ లో కృష్ణ కన్నుమూశారు. కృష్ణ మరణాంతర కార్యక్రమాల్లో నరేష్-పవిత్ర లోకేష్ అన్నీ తానై వ్యవహరించారు. కృష్ణను చివరి చూపు చూసేందుకు రమ్య రఘుపతి పద్మాలయ స్టూడియోకి రావడం జరిగింది. కాగా నరేష్ పవిత్ర లోకేష్ తో వివాహం ప్రకటించారు. దీన్ని రమ్య రఘుపతి ఖండిస్తున్నారు. చట్టబద్ధంగా నాకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడం నేరమని ఆమె ఆరోపిస్తున్నారు. నాకు నరేష్ తో విడాకులు వద్దు, ఆయనే కావాలి. నా కొడుకు తండ్రిని కోరుకుంటున్నాడంటూ రమ్య ప్రతిఘటిస్తున్నారు.