Veera Simha Reddy Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తూ 11 రోజులు పూర్తి చేసుకుంది..ఈ 11 రోజులలో మొదటి రోజు మరియు సంక్రాంతి సెలవుల్లో తప్ప ఈ చిత్రం భారీ స్థాయి కలెక్షన్స్ వసూళ్లను దక్కించుకోలేకపోయింది.. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు మాత్రం ట్రేడ్ కి పెద్ద షాక్.. నేటితరం సూపర్ స్టార్స్ కి ఎలాంటి ఓపెనింగ్ అయితే దక్కుతుందో ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి.. అఖండ తర్వాత బాలయ్య రేంజ్ ఇంత పెరిగిందా అని అందరూ ఆశ్చర్యపోయారు.. సంక్రాంతి వార్ వన్ సైడ్ అయిపోతుందేమో అని అందరూ అనుకున్నారు.. కానీ ఎప్పుడైతే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వచ్చిందో, అప్పటి నుంచి ఆడియన్స్ ‘వీరసింహారెడ్డి’ని పట్టించుకోవడం మానేశారు.. కానీ పొంగల్ హాలిడేస్ బాగా కలిసి రావడంతో బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.. 11 రోజులకుగాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ప్రాంతాల వారీగా చూద్దాం..

ప్రాంతం: వసూళ్లు(షేర్):
———————–
నైజాం 16.60 కోట్లు
సీడెడ్ 15.90 కోట్లు
ఉత్తరాంధ్ర 7.34 కోట్లు
ఈస్ట్ 5.49 కోట్లు
వెస్ట్ 4.12 కోట్లు
నెల్లూరు 2.87 కోట్లు
గుంటూరు 6.29 కోట్లు
కృష్ణ 4.62 కోట్లు
———————-
మొత్తం 63.23 కోట్లు
ఓవర్సీస్ 5.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.75 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 73.68 కోట్లు
ఈ చిత్రం ప్రీరిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 74 కోట్ల రూపాయలకు జరిగింది.. ప్రొమోషన్స్ కాస్ట్ తో కలిపి బ్రేక్ ఈవెన్ మార్కు సాధించాలంటే 75 కోట్ల రూపాయిలు ఈ సినిమా వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ నెల 26వ తారీఖు లోపు బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో పెద్ద హిట్టే.. కానీ లాంగ్ రన్ విషయంలో ‘వీరసింహారెడ్డి’ అఖండ చిత్రానికి దరిదాపుల్లో కూడా ఉండదు అనేది వాస్తవం.. అఖండ చిత్రానికి మొదటి వారం తర్వాత దాదాపుగా 30 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి.. కానీ ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి మాత్రం మొదటి వారం తర్వాత కనీసం పది కోట్ల రూపాయిలు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు.. ఎంటర్టైన్మెంట్ లేకపోవడమే ఈ సినిమాకి లాంగ్ రన్ లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి