Jabardasth Varsha: వర్ష కెరీర్ మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుంది. బుల్లితెర స్టార్ గా ఎదిగిన ఈ సీరియల్ యాక్టర్ టెలివిజన్ షోలలో సందడి చేస్తున్నారు. వర్షకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెను క్రమం తప్పకుండా ఫాలో అయ్యే అభిమానులు ఉన్నారు. వారిని నిరాశపరచకుండా అందాలతో సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంది వర్ష. ఒకప్పుడు వర్ష ఇంస్టాగ్రామ్ లో చాలా అరుదుగా ఫోటో షూట్స్ చేసేవారు. ఇప్పుడు ఆమె వారంలో మూడు నాలుగు ఫొటో షూట్స్ షేర్ చేస్తున్నారు.

వర్షను ఇంస్టాగ్రామ్ లో ఎనిమిది లక్షలకు పైగా నెటిజన్స్ ఫాలో అవుతున్నారు. ఆమె అందాలకు దాసోహం అంటూ , పోస్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వర్ష షేర్ చేసిన క్షణాల్లో ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వర్ష హాఫ్ శారీలో గ్లామర్ ఒలకబోసింది. బ్యాక్ లెస్ జాకెట్ ధరించి, వయ్యారాల నడుము చూపుతూ కుదురుగా ఉన్న కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.
వర్ష జబర్దస్త్ అందాలు చూసి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మెస్మరైజ్ అవుతున్నారు. సన్నజాజి తీగలా స్లిమ్ గా ఉండే వర్ష సోయగాలకు తోడు కవ్వించే చూపులు మరింత డామేజ్ చేస్తున్నాయి. వర్షను అలా చూసి పొగడకుండా ఉండలేకున్న జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇంస్టాగ్రామ్ బుల్లితెర సెలెబ్స్ కి ఆదాయ మార్గంగా మారింది. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా వారి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది.

మరోవైపు వర్ష జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో వర్ష కొనసాగుతున్నారు. వర్షకు ఒక ఇమేజ్ క్రియేట్ కావడంతో టీం లీడర్స్ తమ స్కిట్స్ లో వర్షను తీసుకుంటున్నారు. ఎక్కువగా వర్ష ఇమ్మానియేల్ స్కిట్స్ లో చేస్తారు. వీరి మధ్య కొన్నాళ్లుగా బుల్లితెర కెమిస్ట్రీ నడుస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ వేదికగా సాక్షిగా వర్ష, ఇమ్మానియేల్ ఫేమస్ కావడానికి కూడా వారి లవ్ ఎఫైర్ రీజన్.

ఇమ్మానియేల్ పట్ల వర్ష అమితమైన ప్రేమ కనబరుస్తుంది. అవుట్ ఆఫ్ స్కిట్… అతడంటే నాకు ఎంతో ఇష్టం అని ఓపెన్ గా చెబుతుంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం, అతన్ని ఎప్పటికీ వీడను అని వర్ష పలుమార్లు సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే ఇదంతా సెన్సేషన్ కోసమా.. నిజంగా వర్ష-ఇమ్మానియేల్ ప్రేమించుకుంటున్నారా? అనే విషయంలో క్లారిటీ లేదు. రష్మీ-సుడిగాలి సుధీర్ తర్వాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వర్ష-ఇమ్మానియేల్ ఉన్నారు.