https://oktelugu.com/

Love: వారెవ్వా ఏం ప్రేమ? పెయింటింగ్ అదిరింది

ఈ స్మార్ట్ యుగంలో ప్రేమను దక్కించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అన్ని మార్గాలు సఫలీకృతం కావాలని లేదు. అలాగని విఫలం అవ్వాలని కూడా లేదు. ప్రేమంటే ఒక భావన.. ఆ భావనను ఇద్దరూ కలిసి పంచుకుంటేనే పరిపూర్ణత చేకూరుతుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 17, 2024 / 03:21 PM IST

    Love

    Follow us on

    Love: ఒక మనిషిని చూడగానే గుండె వేగం పెరుగుతుంది. మాటలు కలపాలి అనిపిస్తుంది. ఎంతసేపైనా మాట్లాడాలి అనిపిస్తుంది. చూసేకొద్దీ చూడాలని.. గడిపేకొద్ది ఇంకా గడపాలని.. ఇంకా చాలా చేయాలనిపిస్తుంది. దానినే ప్రేమ అంటారు. ప్రేమించినంతమాత్రాన ఎదుటి వ్యక్తి ప్రేమించాలని లేదు. కాకపోతే మన ప్రేమను చెప్పే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అలాంటి గ్రీన్ సిగ్నల్ రావడానికి ప్రేమికులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది కవితలు రాస్తుంటారు. కొంత మంది అందమైన రోజా పువ్వులు ఇస్తుంటారు. కొంతమంది ఖరీదైన కానుకలు పంపిస్తుంటారు. ఎన్ని పంపించినా అంతిమ లక్ష్యం ప్రేమను దక్కించుకోవడమే.

    ఈ స్మార్ట్ యుగంలో ప్రేమను దక్కించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అన్ని మార్గాలు సఫలీకృతం కావాలని లేదు. అలాగని విఫలం అవ్వాలని కూడా లేదు. ప్రేమంటే ఒక భావన.. ఆ భావనను ఇద్దరూ కలిసి పంచుకుంటేనే పరిపూర్ణత చేకూరుతుంది. పరిపూర్ణతే చాలా దూరం తీసుకెళ్తుంది. అయితే ఇలాంటి పరిపూర్ణత కోసం ఓ ప్రేమికుడు తాను ప్రేమించే యువతిని మెప్పించేందుకు విన్నూత్న ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.

    వెస్ట్రన్ కంట్రీకి చెందిన ఓ యువకుడు యువతిని ప్రేమిస్తున్నాడు. అతడి ప్రేమను ఆమెకు చెప్పాలంటే ధైర్యం సరిపోడం లేదు. అలాగని ఆమెను ప్రేమించకుండా ఉండలేడు. చాలా రోజులు గడిచిన తర్వాత.. ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఓ దేహం పైన అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. తన ప్రియురాలికి పూల గుత్తి ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తున్నట్టు ఆ పెయింటింగ్ రూపొందించాడు. ఆ అవును ఆ యువతి ఇంటి పరిసరాల్లో వదిలిపెట్టాడు. ప్రస్తుతం ఆ దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది రెండు మిలియన్ లైక్స్ పొందింది. 14,000 మంది ఈ చిత్రాన్ని చూసి స్పందించారు. అయితే ఇందులో కొంతమంది ఆవు దేహం పై అలాంటి పెయింటింగ్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తే.. మరి కొంతమంది ప్రేమను వ్యక్తం చేయడంలో వినూత్న పద్ధతి అని కొనియాడారు.