Varasudu Collections: తమిళ హీరోలలో ఇప్పుడు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ని ఏర్పర్చుకున్న హీరో ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు ‘ఇళయదళపతి విజయ్’..ఈ తమిళ హీరో అంటే మన తెలుగోళ్ళకి ఒకప్పుడు ఎవరో కూడా తెలియదు..తుపాకీ నుండి తన సినిమాలను విడుదల చేసుకుంటూ వచ్చాడు..చిన్నగా గుర్తింపు సంపాదించాడు..ఇప్పుడు రజినీకాంత్ మరియు సూర్య తర్వాత ఆ రేంజ్ గుర్తింపు మరియు మార్కెట్ తెలుగు లో రప్పించుకున్నాడు..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘వారిసు’ సినిమా తమిళం లో పెద్ద హిట్ అయ్యింది..జనవరి 11 వ తేదీన తమిళం తో పాటుగా తెలుగు లో కూడా ఈ సినిమాని విడుదల చేద్దాం అనుకున్నారు..కానీ చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు ఉండడం తో 14 వ తేదికి వాయిదా వేశారు..తమిళం లో విడుదలై రెండు రోజుల తర్వాత తెలుగు విడుదలైనప్పటికీ కూడా ‘వారసుడు’ సినిమాకి బంపర్ ఓపెనింగ్స్ దక్కాయి.
మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు కావడం తో మొదటి రోజు ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ కి సరిసమానంగా థియేటర్స్ ని మరియు షోస్ ని హోల్డ్ చేసాడు..అందువల్ల ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి..దిల్ రాజు బ్రాండ్ తో పాటుగా పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడం వల్ల అంత మంచి ఓపెనింగ్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఒక్క నైజాం ప్రాంతం లోనే ఈ సినిమాకి మొదటి రోజు కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక రెండవ రోజు మొదటి రోజు కంటే మంచి వసూళ్లను రాబట్టింది..రెండవ రోజు కూడా ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట..అలా విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం సంక్రాంతి పండగ ని బాగా క్యాష్ చేసుకొని 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.