https://oktelugu.com/

Baba Vanga 2022 Predictions: 2022లో కల్లోలమే.. మరో వైరస్ ఎటాక్.. భూమిపై ఏలియన్స్ దాడి

Baba Vanga 2022 Predictions: పూర్వం కాలంలో మను రుషులు కళ్లు మూసుకొని భవిష్యత్తును ఊహించేవారు. అదే విధంగా ఆధునిక కాలంలో వంగ బాబా భవిష్యత్తును కొంతవరకూ ఊహించారు. 2022కి సంబంధించి ఏం చెప్పారో తెలుసుకుందాం.. భవిష్యత్తును ముందే ఊహించి కాలజ్ఞానం చెప్పారు మన బ్రహ్మం గారు. ఉత్తరాన ‘కరోనా’ పుట్టి మనుషులను చంపేస్తుందని ఆనాడే బ్రహ్మంగారు సెలవిచ్చారు. అన్నట్టుగానే ఉత్తరాన ఉన్న చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని బలితీసుకుందో మనం చూశాం. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2021 / 06:08 PM IST
    Follow us on

    Baba Vanga 2022 Predictions: పూర్వం కాలంలో మను రుషులు కళ్లు మూసుకొని భవిష్యత్తును ఊహించేవారు. అదే విధంగా ఆధునిక కాలంలో వంగ బాబా భవిష్యత్తును కొంతవరకూ ఊహించారు. 2022కి సంబంధించి ఏం చెప్పారో తెలుసుకుందాం..

    baba vanga

    భవిష్యత్తును ముందే ఊహించి కాలజ్ఞానం చెప్పారు మన బ్రహ్మం గారు. ఉత్తరాన ‘కరోనా’ పుట్టి మనుషులను చంపేస్తుందని ఆనాడే బ్రహ్మంగారు సెలవిచ్చారు. అన్నట్టుగానే ఉత్తరాన ఉన్న చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని బలితీసుకుందో మనం చూశాం. మన దేశంలో బ్రహ్మంగారిని నమ్మినట్టే.. యూరప్ కు ఉత్తరాన ఉన్న బల్గేరియా దేశంలో ‘వంగ బాబా’ను ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు. ఎందుకంటే ఆమె చెప్పింది చెప్పినట్టు జరిగింది మరీ..

    1996లోనే కన్నుమూసిన ‘వంగబాబా’ పుట్టుకతోనే అంధురాలు.. అయినా కూడా భవిష్యత్తును చక్కగా అంచనావేసి చెప్పింది. ఆమె చెప్పిన అంచనాలన్నీ నిజమయ్యాయి.

    అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, బ్రెగ్జిట్, , 2004 సునామీ ముందే ఊహించింది. 2022లో సైబీరియాలో కొత్త వైరస్ వస్తుందని.. ఏలియన్స్ భూమిపై దాడి చేస్తారని చెప్పింది. అవన్నీ కూడా నిజం అవుతాయని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. ఆమె బతికి ఉండగానే చాలా మంది వివిధ సంవత్సరాల్లో ఏం జరుగుతుందో డైరెక్టుగా ఆమెతో మాట్లాడిన ఆమె చెప్పిన విషయాలు రాసుకున్నారు. వాటిలో చాలా వరకూ నిజమయ్యాయి.

    వంగబాబా 5079 సంవత్సరం వరకూ అంచనాలు ఇచ్చారు. ఆమె చెప్పినవి 85 శాతం జరుగుతున్నాయి. మూడు రోజుల్లో 2021 ముగిసి 2022 రాబోతోంది. అయితే వచ్చే సంవత్సరం కూడా ఆనందంగా గడవదని.. ఉపద్రవాలు పొంచి ఉన్నాయని అర్థమవుతోంది.

    2022లో భూకంపాలు, సునామీల దాడి ఎక్కువగా ఉంటుందని వంగబాబా చెప్పారు. ఆ సునామీ వల్ల ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాకు వరదలు వస్తాయని ఆమె చెప్పారు. వచ్చే సంవత్సరంలో ఇది జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

    వంగబాబా చెప్పిన దాని ప్రకారం.. గ్రహాంతరవాసులు ఒక శాటిలైట్ ను పంపిస్తారట.. అది భూమిపై ఉన్న వాతావరణాన్ని అంచనావేసి మనుషులపై దాడి చేసత్ుందని.. జైలు పాలు చేస్తుందని చెప్పారు. 2130 నాటికి సముద్రంలోపల ఎలా జీవించాలో ఏలియన్స్ ద్వారా మనుషులు నేర్చుకుంటారని వంగబాబా తెలిపారు.

    2022లో ప్రపంచంలోని చాలా ప్రముఖ నగరాల్లో మంచినీటి కొరత ఉంటుందని వంగబాబా అంచనావేశారు. నదుల్లో కాలుష్యం పెరుగుతుందని అంచనావేశారు.

    ఇప్పుడు ఇదే విషయాలు ప్రముఖ మీడియాలోనూ హైలెట్ అవుతున్నాయి. మరి నిజంగానే భూమిపై ఏలియన్స్ దాడులు చేస్తాయా? .. ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.