Vanajeevi Ramaiah : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఖమ్మం ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. మన జీవిరామయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు ఆయన ఖమ్మం ప్రభుత్వ పెద్ద ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయనకు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో కన్నుమూశారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటిన వాన ప్రేమికుడిగా ఆయన పేరుగాంచారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2017లో నాటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో వనజీవి రామయ్యను సత్కరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన తొలి వ్యక్తిగా వన జీవి రామయ్య నిలిచారు.
Also Read : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్.. రాహుల్ అభ్యంతరంతో ఉత్కంఠ!
రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదం
మనజీవి రామయ్య సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. ఆ సమయంలో ఆయనకు ఖమ్మం పెద్దాసుపత్రిలో ప్రస్తుత డిసిహెచ్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. నాడు డాక్టర్ రాజశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో దాదాపు పది రోజులపాటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ లో వన జీవి రామయ్య చికిత్స పొందారు. వనజీరామయ్యకు చికిత్స అందిస్తున్న తీరును నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. నాడు ఆ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత వనజీవి రామయ్య మళ్లీ మొక్కలు నాటడం మానుకోలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వన జీవి రామయ్య దంపతులను సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేస్తున్న కృషిని కొనియాడారు. చిన్నప్పటినుంచే మొక్కలంటే విపరీతమైన ఇష్టం ఉన్న వనజీవి రామయ్య.. యుక్త వయసు నుంచే వాటిని నాటడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయనను చాలామంది వింతగా చూసేవారు. ఆ తర్వాతే ఆయనను గుర్తించడం మొదలుపెట్టారు. వరంగల్ క్రాస్ రోడ్డు, ఏదులాపురం, కోదాడ రోడ్డు, కొత్తగూడెం రోడ్డు.. ఇలా ఖమ్మం నలుమూలలా వనజీవి రామయ్య మొక్కలు నాటారు. తన ఇంట్లో ఎర్రచందనం మొక్కలు నాటారు. అంతేకాదు అవి ఏపుగా పెరిగిన తర్వాత.. వాటి దుంగలను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని వనజీవి రామయ్య గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ సంతోష్ రావు ఎదుట ప్రస్తావిస్తే. దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు.. ఇలా చెప్పుకుంటూ పోతే వన జీవిరామయ్య పర్యావరణహితం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ కాలపు అశోకుడిగా పేరుపొందారు. వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూసిన నేపథ్యంలో.. ఖమ్మం డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ఇతర అధికారులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ” వనజీవి రామయ్య తో గడిపే అవకాశం నాకు చాలా సందర్భాల్లో లభించింది. ఒక వైద్యుడిగా అతడికి సేవలు అందించే అవకాశం కూడా నాకు చాలాసార్లు దక్కింది. ప్రతి సందర్భంలోనూ ఆయన మొక్కల కోసం మాత్రమే తపించేవారు. మొక్కలను నాటాలని.. మొక్కలతో మాత్రమే బతుకుదెరువు ఉంటుందని పేర్కొనేవారు. అందువల్లే ఆయన చరితార్థుడిగా మిగిలిపోయారు. అటువంటి వ్యక్తి కన్ను మూయడం ఆయన కుటుంబానికి కాదు.. పర్యావరణానికే నష్టం” అని డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read : తాగినోళ్లకు తాగినంత.. మందుబాబులకు ఇదో గొప్ప గుడ్ న్యూస్
