Vamshi Paidipally: మిస్టర్ కూల్ వంశీ పైడిపల్లి మండిపడ్డాడు. ఆయన ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో వారసుడు చిత్రంపై ట్రోల్స్ చేస్తున్నవారి మీద తీవ్ర అసహనం చూపించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు జనవరి 14న విడుదలైంది. తమిళ వర్షన్ జనవరి 11న విడుదల చేశారు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అనూహ్యంగా తమిళంలో వారిసు చిత్రంపై అజిత్ కుమార్ తునివు పైచేయి సాధించింది. కలెక్షన్స్ లో అజిత్ జోరు చూపిస్తున్నాడు. తునివు కోలీవుడ్ సంక్రాంతి విన్నర్ గా డిసైడ్ చేశారు. ఈ క్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మీద కోలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియా దాడులు చేస్తున్నారు.

అవుట్ డేటెడ్ స్టోరీ తీసుకొచ్చి విజయ్ మొహాన కొట్టాడు. వారిసు డైలీ సీరియల్ గా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ పై వంశీ పైడిపల్లి స్పందించారు. తమిళ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీ పైడిపల్లి… ఒక సినిమా చేయాలంటే వందల మంది తీవ్రంగా కష్టపడతారు. విజయ్ వంటి సూపర్ స్టార్ గంటల తరబడి డాన్స్ స్టెప్స్ రిహార్సల్స్ చేశారు. డైలాగ్స్ నేర్చుకున్నారు. ఎంతో మంది కష్ట ఫలితంగా సినిమా రూపొందుతుంది. దాన్ని ఒక్క కామెంట్ తో కొందరు తీసిపారేస్తున్నారు.
నా సినిమా సీరియల్ లా ఉందంటున్నారు. అసలు సీరియల్స్ ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సీరియల్స్ ఎంతో మందిని అలరిస్తున్నాయి. అవి కూడా క్రియేటివిటీలో భాగమే… అంటూ సీరియస్ అయ్యారు. ఎప్పుడూ కూల్ గా ఉండే వంశీ పైడిపల్లి ఆవేశంగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలో వారిసు చిత్రంపై ట్రోల్స్ ఏ రేంజ్ లో ఆయన్ని హర్ట్ చేశాయో చెప్పవచ్చు.

కాగా ఈ కథ హీరో మహేష్ తో చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నారు. దాదాపు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. మహర్షి అనంతరం మహేష్ తో ఈ మూవీకి సంబంధించిన ఏర్పాట్లు వంశీ పైడిపల్లి చేసుకున్నారు. అనూహ్యంగా మహేష్ మనసు మారింది. స్క్రిప్ట్ లో మార్పులు చేయాలంటూ ప్రాజెక్ట్ ఆపేశాడు. ఈ లోపు దర్శకుడు పరుశురాంతో సర్కారు వారి పాట ప్రకటించారు. ఇక మహేష్ తన మూవీ చేయరని నిర్ణయించుకున్న వంశీ పైడిపల్లి-దిల్ రాజు కోలీవుడ్ స్టార్ విజయ్ ని సంప్రదించారు. వారసుడు రిజల్ట్ చూశాక మహేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే మహేష్ కి మరో బ్రహ్మోత్సవం అయ్యేదన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.