
Uttar Pradesh: కుక్కలు క్రూర మృగాలుగా మారుతున్నాయి. విశ్వాసానికి మారుపేరు అయన శునకాలు మాంసాహారులే. పెంపుడు జంతువులు కూడా కానీ, ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మనుషులను పీక్కుతినేంత క్రూరంగా మారుతున్నాయి. అయితే పిట్ బుల్ డాగ్స్ వంటివి మనుషుల్ని కూడా స్వాహా చేస్తాయని సమాచారం. అలాంటి సంఘటనలు కూడా అరుదుగానే జరుగుతుంటాయి. కానీ ఇటీవల హైదరాబాద్ లో వీధి కుక్కల కాటుకి ఓ బాలుడు బలైపోయిన ఘటన తర్వాత అసలు కుక్కలు ఎందుకిలా దాడి చేస్తున్నాయనే చర్చ మొదలైంది. చిన్న పిల్లవాడు కుక్కల్ని అదిలించలేక, వాటినుంచి తప్పించుకోలేక చనిపోయాడనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో 65 ఏళ్ల ఓ వ్యక్తి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాడు. అతడికి తప్పించుకునే వీలుంది కానీ, కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసి అతి క్రూరంగా ఆ వ్యక్తిని చంపేశాయి.
మనుషుల్ని వేటాడుతున్న కుక్కలు..
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో సోమవారం ఉదయం జాగింగ్‌కు వచ్చిన డాక్టర్ సఫ్దర్ అలీని కుక్కలు దారుణంగా చంపేశాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లోని పార్క్‌లో సఫ్దర్ అలీ నిలబడి ఉన్నాడు. అంతలో ఓ కుక్క అతడివైపు వచ్చింది. దాన్ని అదిలించేలోపు మరో కుక్క వచ్చింది. ఆ రెండింటినీ తప్పించుకునే సమయంలో మరిన్ని కుక్కలు వరుసగా దాడి చేశాయి. రెప్పపాటులో అతడిని కుక్కల గుంపు చుట్టుముట్టింది. తేరుకునేలోపే తీవ్రంగా గాయపరిచాయి. రాబందుల గుంపు దాడి చేసి పీక్కుతిన్నట్టు.. కుక్కలు అతడిని తీవ్రంగా గాయపరిచాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే సఫ్దర్ అలీ మృతి చెందాడు.

సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు..
ఉదయం ఏడున్నర గంటలకు పార్క్‌లో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన సిబ్బందికి అసలేం జరిగిందో అర్థం కాలేదు. అక్కడ మర్డర్ జరిగిందా అనే అనుమానం వారికి వచ్చింది. చివరికి సీసీ కెమెరాల ఫుటేజీ చూడటంతో అసలు విషయం తెలిసింది. డాక్టర్ సఫ్దర్ అలీపై కుక్కల దాడి భయానకంగా ఉంది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉదయం ఆరున్నర గంటలకే ఈ దాడి జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
సాధారణంగా.. పిట్ బుల్, రోట్ వీలర్, డోగో అర్జెంటీనో జాతి కుక్కలు డేంజర్ అని భావిస్తారు. నోయిడా సమీపంలోని ఘజియాబాద్ జిల్లాలో మూడు జాతుల కుక్కలను పెంచుకోడానికి అనుమతి లేదు. అయితే సోమవారం జరిగిన దారుణానికి వీధి కుక్కలే కారణం. మనుషులనే కుక్కలు వేటాడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
*NEWS ALIGARH UP*
अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी कैम्पस में सुबह टहलने गए सफदर अली नाम के व्यक्ति का मिला शव,,, कैंपस में स्थित एक डिपार्टमेंट के लॉन में सफदर का शव मिलने से मचा हड़कंप,, @Uppolice @AMUofficialPRO @kuldeep_gunawat pic.twitter.com/4jUuxpTniR
— M A K (@wassey_pur) April 16, 2023