https://oktelugu.com/

America: కడుపు మాడ్చి.. కన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి..

ఇండియాకు చెందిన ప్రియంక భర్త, కొడుకుతో కలిసి అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఉంటుంది. ఇటీవల దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 29, 2023 / 05:27 PM IST

    America

    Follow us on

    America: తన పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుంది.. వారు తప్పుచేసినా.. కడుపులోపెట్టుకు చూసుకుంటుంది.. అయితే అమెరికాలో ఓ తల్లి మాత్రం భార్యభర్తల గొడవను కొడుకుపై చూపింది. భర్త తనను విడిచి వెళ్లాడని కొడుకుకు అన్నం పెట్టకుండా కడుపు మాడ్చింది. చివరకు ఆకలితో కొడుకు చనిపోయేలా చేసింది.

    నార్త్‌ కరోలినాలో ఘటన..
    ఇండియాకు చెందిన ప్రియంక భర్త, కొడుకుతో కలిసి అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఉంటుంది. ఇటీవల దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. భార్య టార్చర్‌ భరించలేక ఆమె భర్త కొడుకు, ప్రియాంకను వదిలి వెల్లిపోయాడు. దీంతో ప్రియాంక ఆ కోపాన్ని కొడుకుపై చూపింది.

    అన్నం పెట్టకుండా..
    భర్త వదిలేసి వెళ్లాడన్న కోసంతో ప్రియాంక తన కొడుకును కూడా పట్టించుకోవడం మానేసింది. కనీసం తిండి కూడా పెట్టలేదు. దీంతో సదరు బాబు.. ఆకలితో అలమటించాడు. చివరకు ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని ప్రియాంకనే పోలీసులకు సమాచారం అందించింది.

    ఘటన స్థలం పరిశీలించి పోలీసుల షాక్‌..
    ప్రియాంక ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే అక్కడి దృశ్యం చూసి షాక్‌ అయ్యారు. కొడుకు చనిపోయి, శరీరం కుళ్లిపోయే స్థితిలో ఉంది. బాడీని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాబు తిండి లేక చనిపోయాడని వెల్లడించారు.