https://oktelugu.com/

Petrol Price : కేంద్రం పెట్రోలు ధరలు తగ్గిస్తే తెలుగు రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయా?

ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు మోడీ సర్కార్ ఎందుకు నిర్ణయించింది.. కేంద్రం పెట్రోలు ధరలు తగ్గిస్తే తెలుగు రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2023 / 04:56 PM IST

    Petrol Price : ఇవ్వాళ, రేపట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందనే వార్త గుప్పుమంటోంది. కేంద్రం దాదాపు రూ.8 నుంచి రూ.10 వరకూ పెట్రో ధరలు తగ్గించబోతోందని కాన్ఫిడెన్షియల్ గా వార్త వస్తోంది. అక్టోబర్ 2022లో ఒకసారి పెట్రోల్ ధరలు తగ్గించారు. మరోసారి తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది.

    డిసెంబర్ ముగిసింది. ఎన్నికల వాతావరణం వచ్చేస్తోంది. ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావడం కోసం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తోంది.

    ఇప్పటికే బియ్యం ధరలను కట్టడి చేసేందుకు భారత్ బ్రాండ్ తో రూ.25 కే కిలోబియ్యం అమ్మడానికి సిద్ధమైంది. ఇప్పటికే గోధుమలు, పప్పులపై తగ్గించారు.

    దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రూ. 110.48 (డిసెంబర్ 28న) ఉంది. రెండో రాష్ట్రంగా మరో తెలుగు రాష్ట్రం రూ.109.66 గా ఉంది. ఇక దేశంలోనే అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే జనాభా అత్యధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో రూ. 96.53 గా ఉంది. ఓవరాల్ గా ఉత్తరాఖండ్ 95.28తో తో అత్యంత తక్కువగా ఉంది.

    ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు మోడీ సర్కార్ ఎందుకు నిర్ణయించింది.. కేంద్రం పెట్రోలు ధరలు తగ్గిస్తే తెలుగు రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.