UPI Payments: స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI) యూపీఐ(unified payments interface) ద్వారా చెల్లింపులను ప్రారంభించింది.. మొదట్లో యూపీఐ పేమెంట్లు పే టీఎం (Paytm) ద్వారా జరిగేవి. అయితే పేటీఎం కొంతమందికి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత ఫోన్ పే అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఇక ఇదే సమయంలో కోవిడ్ వ్యాపించడంతో డిజిటల్ చెల్లింపులు అనివార్యం అయిపోయాయి. దీంతో ఫోన్ పే మరింత చేరువైపోయింది. ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులను మరింత పెంచడంతో ఫోన్ పే వినియోగం ఇంకా ఎక్కువైంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి లో ఫోన్ పే అనేది సర్వసాధారణమైపోయింది. అయితే ఫోన్ పే ద్వారా డిజిటల్ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో ఆమెజాన్, గూగుల్ వంటివి కూడా ఈ పేమెంట్స్ రంగంలోకి వచ్చేసాయి. అమెజాన్ పే, గూగుల్ పే వంటివి తమ సర్వీస్లను మొదలుపెట్టాయి. ఫోన్ పే గుత్తాధిపత్యం సాగిస్తున్న డిజిటల్ పేమెంట్ల రంగంలో అవి కూడా తమ సత్తాను చూపించడం మొదలుపెట్టాయి. అయితే ఫోన్ పే కు ఉన్న మార్కెట్ ను మాత్రం అందుకోలేకపోయాయి. అయితే తరచూ యూపీఐ సర్వర్ బ్రేక్ డౌన్ అవుతున్న నేపథ్యంలో.. డిజిటల్ చెల్లింపులు జరగడం లేదు. ఇటీవల కాలంలో ఈ తరహా సమస్య పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా కొద్ది గంటల పాటు డిజిటల్ చెల్లింపులు నిలిచిపోవడంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు.
Also Read: ఏప్రిల్ 2నుంచి ప్రతి వాహనంలో ప్రజల ప్రాణాలకు కాపాడే ఈ రెండు ఫీచర్స్ తప్పనిసరి
తాజాగా సర్వీసుల్లో అంతరాయం
ఇక బుధవారం యూపీఐ సేవలో అంతరాయం చోటుచేసుకుంది. ఫోన్ పే పనిచేయలేదు. డబ్బు పంపితే అవతలి వ్యక్తికి వెళ్లలేదు. చివరికి ఖాతాలో ఉన్న నగదు నిలువలను చూసుకుందామను కుంటే ఆ సర్వీస్ కూడా పనిచేయలేదు. దీంతో యూజర్లు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు ఎస్బిఐ సర్వర్ కూడా డౌన్ కావడంతో.. ఆ బ్యాంకు సేవలు కూడా నిలిచిపోయాయి. యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర బ్యాంకుల ఖాతాదారులకు మాత్రమే సేవలు లభించాయి. అయితే వారు గూగుల్ పే(కొన్ని చోట్ల మాత్రమే) ద్వారా తమ నగదు వ్యవహారాలను సాగించారు.. యూపీఐ లో సర్వర్ డౌన్ వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని.. ఆ సమస్యను గుర్తించి పరిష్కరించామని.. ఖాతాదారులు తమ నగదు లావాదేవీలను యధావిధిగా కొనసాగించవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది..” సాంకేతిక సమస్య ఏర్పడటం వల్ల యూపీఐ సేవలు నిలిచిపోయాయి. కాకపోతే ఇది తాత్కాలికమైనదే. ఈ సమస్యను గుర్తించి పరిష్కరించాం. కొద్ది క్షణాలు మాత్రమే సేవల్లో అంతరాయం చోటు చేసుకుంది. ఇప్పుడు ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను యధావిధిగా కొనసాగించవచ్చు. సర్వర్ డౌన్ కావడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఇకపై ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని” నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.