Upasana: 10 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఉపాసన-రామ్ చరణ్ తమ ఫస్ట్ చైల్డ్ ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించనున్నారు. ఈ శుభవార్తను చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. ఆ హనుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. చిరంజీవి ప్రకటన మెగా అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నింపింది. కారణం… చాలా కాలంగా వారు ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నటవారసత్వాని ముందుకు తీసుకెళ్ళే బుల్లి మెగాస్టార్ రావాలని కలలు కంటున్నారు.

పిల్లలు కనేందుకు రామ్ చరణ్ దంపతులు సుదీర్ఘ సమయం తీసుకోవడంతో అభిమానుల్లో ఒకింత ఆందోళన, అసహనం చోటు చేసుకున్నాయి. తాజా వార్తతో వారిలో గూడుకట్టుకున్న అపోహలు, అనుమానాలు పటాపంచలు అయ్యాయి. అందుకే సంబరాలు చేసుకుంటున్నారు. కాగా తల్లి అయిన ఉపాసన మొదటిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె ఆసక్తికర కామెంట్ పోస్ట్ చేశారు.
‘నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలో అడుగుపెట్టాను. అయితే అత్తమ్మను చాలా మిస్ అవుతున్నాను’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ తో పాటు అమ్మ, బామ్మతో పాటు తన కుటుంబంలోని మహిళలతో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఉపాసన అత్తగారైన సురేఖ మిస్ అయ్యారు. అందుకే ఉపాసన… అత్తమ్మను మిస్ అవుతున్నానంటూ ప్రత్యేకంగా కామెంట్ తో గుర్తు చేసుకున్నారు.

గర్భవతి అయిన ఉపాసన అత్తింటి నుండి పుట్టింటికి వెళ్ళింది. ఆమె డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉంటారని సమాచారం. తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి కాన్పు తల్లిదండ్రులు చేసిన పంపుతారు. దానిలో భాగంగానే ఉపాసన అమ్మానాన్నల దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. వేల కోట్ల ఆస్థిపరురాలైన ఉపాసన… దోమకొండ సంస్థానం వారసురాలు. గోల్డెన్ స్పూన్ తో పుట్టి, హై క్లాస్ సొసైటీలో పెరిగిన ఉపాసన చాలా సాంప్రదాయంగా ఉంటారు. కట్టు బొట్టు, మాటతీరులో తెలుగుతనం ఉట్టిపడుతుంది. సురేఖను ఉపాసన అత్తమ్మ అని ప్రేమగా పిలుస్తారు. మరోవైపు రామ్ చరణ్ దర్శకుడు శంకర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
View this post on Instagram