UP Woman: అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రజలకు ఎర వేస్తున్నాయి. ఉచితాలకు అలవాటు పడ్డ ఓటర్లు.. రాజకీయ పార్టీలను ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలలో లబ్ధి పొందడానికి దొడ్డిదారులు వెతుకుతున్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ నాయకులను ప్రజలు మించిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల ఒక పథకం తెరపైకి తీసుకువచ్చింది. పెళ్లి చేసుకున్న జంటలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి ప్రభుత్వం గేదెలను రాయితీ మీద అందిస్తోంది. అయితే ఈ పథకానికి అక్కడ విపరీతమైన ఆదరణ లభించింది. గేదెలను ప్రభుత్వం ఇవ్వడం ద్వారా చాలా కుటుంబాలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి అడుగులు వేస్తున్నాయి. అయితే మహిళలకే యోగి ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఇవ్వడంతో.. వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఈ అవకాశాన్ని యోగి ప్రభుత్వం కల్పించడంతో.. కొంతమంది అడ్డమైన ప్లాన్లు వేస్తున్నారు. అందులో ఈ మహిళ కూడా ఒకరు. ఆమె పేరు రేష్మా(పేరు మార్చాం). ఈమెకు గతంలోని వివాహం జరిగింది. కాకపోతే భర్తతో విభేదాలు తలెత్తి పుట్టింటి వద్దే ఉంటున్నది. అయినప్పటికీ భర్త ఆమెను తీసుకువెళ్లడం లేదు. పెద్ద మనుషులతో రాయబారాలు పంపించినప్పటికీ అతడు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆమె రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమీప గ్రామంలో ఉన్న ఓ యువకుడిని రేష్మ తల్లిదండ్రులు సంప్రదించారు. రేష్మకు కూడా అతడు నచ్చాడు. దీంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా పెళ్లిరోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో రేష్మ వివాహం జరుగుతుందనగా సడన్ గా మొదటి భర్త ఎంట్రీ ఇచ్చాడు. అతని బంధువులు కూడా రావడంతో పెళ్లి ఆగిపోయింది.
రేష్మ ప్లాన్ అది
మొదటి భర్త ద్వారా విభేదాలు తలెత్తి పుట్టింట్లో ఉంటున్న నేపథ్యంలో రేష్మ కు ఒక ఐడియా వచ్చింది. తను రెండవ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే గేదెలను సొంతం చేసుకోవచ్చని.. తద్వారా రెండవ భర్తతో సంసారం కూడా చేయవచ్చని భావించింది. ఇందులో భాగంగానే తమ సమీప బంధువుతో రెండవ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. ముందు అతడు ఒప్పుకోకపోయినప్పటికీ.. తన మాటలతో అతడిని మాయ చేసింది.. పెళ్లికి ఒప్పించేలా చేసింది. చివరికి రేష్మ ప్లాన్ ఇలా బెడిసి కొట్టింది.. మొదటి భర్త పెళ్లి జరిగే ప్రాంతంలోకి ఎంట్రీ ఇవ్వడం.. ఈ సమాచారాన్ని ముందుగానే పోలీసులకు చెప్పడంతో రేష్మ రెండవ పెళ్లి మధ్యలో ఆగిపోయింది. అంతేకాదు ప్రభుత్వం ద్వారా లబ్ధిని అక్రమంగా పొందడానికి రేష్మ వేసిన ప్లాన్ పోలీసులకు తెలియడంతో వారు.. కఠిన చర్యలకు ఉపక్రమించారు. రేష్మను.. రెండో పెళ్లి చేసుకునే వ్యక్తిని.. ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. గేదెలు పొందిన లబ్ధిదారుల వివరాలను మరింత సమగ్రంగా పరిశీలించాలని.. అనర్హులు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని యోగి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.