Lunar Eclipse 2022- YouTube: “కొత్తగా చింత పాతకు రోత”.. ఈ సామెత గనుక లేకుంటే టెక్నాలజీ యుగం ముందుకు వెళ్ళేది కాదేమో.. ఎన్నెన్ని ఆవిష్కరణలు వెల్లువలా వచ్చాయి? ఇంకెన్ని సాంకేతిక పరికరాలు మనల్ని మంచెత్తాయి? ఇవే గనక లేకుంటే మనిషి జీవితం ఎలా ఉండేది? ఊహించుకోవడానికి కష్టమవుతుంది కదూ! బొమ్మ వెనుక బొరుసు ఉన్నట్టు.. ఈ ఉత్పత్తుల వెనుక, ఈ సాంకేతిక అభివృద్ధి వెనుక.. ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నాయి. చేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్నెన్నో సౌకర్యాలు మన కాళ్ళ ముందుకు వచ్చాయి. అలాంటి వాటిలో ఉండేది యూట్యూబ్. ఈ ముహూర్తాన సెర్జ్ బ్రౌన్, లారీ ఫేజ్ దీన్ని ప్రారంభించారో గాని.. ఇప్పుడు దీని ఆధారంగానే ప్రపంచం నడుస్తోంది. వేల కోట్ల వ్యాపారం దీని ఆధారంగానే సాగుతోంది. యూట్యూబర్లు, వ్లాగర్లు, షెఫ్ లు.. ఒకరా ఇద్దరా.. ఇప్పుడు సమస్త మొత్తం యూట్యూబ్ లోనే..

నానా చెత్త అయ్యింది
యూట్యూబ్లో తెలుగు వీడియోస్ ఫాలో అయ్యే జనాలకు ఎవరికైనా ఆ మాధ్యమం ఎంత అద్వానంగా తయారయిందో ఇట్టే అర్థమవుతుంది. పనికి మాలిన పిచ్చి కంటెంట్ తో యూట్యూబ్ నిండిపోయింది. సాహేతుక సమాచారం కంటే చెత్తతో నిండిపోయింది. తెలుగు యూట్యూబ్ కంటెంట్ అంటే ఒకప్పుడు ఒక భావన ఉండేది. ఇప్పుడు ఆ స్థాయి నానాటికి దిగ జారిపోతుంది. మరి కొన్ని గంటల్లో గ్రహణం రాబోతోంది. దీన్ని ఆధారంగా తీసుకుని యూట్యూబ్లో అర్థం లేని చెత్తను అప్లోడ్ చేశారు. గ్రహణం సమయంలో చేయకూడని పనులు అంటూ అందమైన థంబ్ నెయిల్ పెట్టి వీడియోలు పోస్ట్ చేశారు. ఇందులో హేతుబద్ధత ఎంత అనేది పక్కన పెడితే చాలా మంది వీటిని పాటిస్తూ ఉంటారు కూడా. అయితే రెగ్యులర్ గా చెప్పే విషయాలు చెప్తే వ్యూస్ రావు కదా.. ఇక్కడే యూట్యూబ్ ఛానల్ ల పిచ్చి పరాకాష్టకు చేరుకుంది.. గ్రహణం సమయంలో సెక్స్ చేయొచ్చా? గ్రామ పడుతున్నప్పుడు శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుంది? లాంటి చెత్త హెడ్డింగ్ లతో ప్రజలను యూట్యూబ్ ఛానళ్ళు పిచ్చెక్కిస్తున్నాయి.

ఏమిటి సంబంధం
సైన్స్ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సెక్స్ కు, గ్రహణానికి ఏమిటి సంబంధం? ఎవరికి తోచిన పద్ధతులు వారు అనుసరిస్తారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వాళ్ల నమ్మకాలు, అపోహలు అని చెప్పడం ఇక్కడ మా ఉద్దేశం కాదు. యూట్యూబ్ వీడియోల్లో మాత్రం గ్రహణ సమయంలో సెక్స్ చేయమ ని కొందరు చెప్తుంటే… వద్దని కొందరు చెబుతున్నారు. ఫలానా రాష్ట్ర వాళ్ళు మాత్రమే శృంగారానికి దూరంగా ఉంటే సరిపోతుందని కొందరు సెలవిస్తున్నారు. అయితే ఇలాంటి వాటికే వేలల్లో వ్యూస్ రావడం గమనార్హం. ఆ మధ్య రాజస్థాన్లో యూట్యూబ్ లో చూసి ఒక బ్యాంకుకు కన్నం వేశారు.. ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఏపీలోని భీమవరంలో తను మందు తాగిన వీడియోని కొంతమంది యువకులు అప్లోడ్ చేశారు. అది పోలీసులు చూసి వారిని అరెస్టు చేశారు. తలతిక్క యూట్యూబ్ క్రియేటర్లు ఉన్నంతవరకు పనికిమాలిన చెత్తకు డోకా లేదు. కానీ వాటికే వ్యూస్ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే కేంద్రం త్వరలో సోషల్ మీడియాకు సంబంధించి పలు చట్టాలను తీసుకొచ్చే యోచనలో ఉండడంతో ఇలాంటి వాటికి చెక్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.