Unstoppable With Nbk- Pawan Kalyan: ఆహా మీడియా లో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. మొదటి సీజన్ కంటే సీజన్ 2 అతి పెద్ద బ్లాక్ బస్టర్ సీజన్ అయ్యే దిశగా ముందుకి దూసుకుపోతోంది.. ఇప్పటి వరుకు ప్రసారమైన ఎపిసోడ్స్ అన్ని ఒక ఎత్తు అయితే..ఇక నుంచి ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్స్ అన్నీ మరో ఎత్తు.. తదుపరి ఎపిసోడ్ కి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న సంగతి తెల్సిందే.

ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న చిన్న గ్లిమ్స్ వీడియోస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటుగా గోపీచంద్ కూడా హాజరయ్యాడు.. ఫుల్ ప్రోమో అతి త్వరలోనే రాబోతోంది.. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతుందనే టాక్ ఉంది కానీ, ఇంకా టెలికాస్ట్ డేట్ ఆహా మీడియా నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ వివరాలు ఇంకా పూర్తిగా ఇవ్వకముందే మరో సంచలన ప్రకటనకు హింట్ ఇచ్చేసింది ఆహా మీడియా.. అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో లో పాల్గొనబోతున్నాడు అంటూ ఒక చిన్న గ్లిమ్స్ వీడియో ద్వారా హింట్ ఇచ్చారు ఆహా మీడియా టీం.. పూర్తి వివరాలు త్వరలో అంటూ విడుదల చేసిన ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది..మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి టాక్ షోకి హాజరు కాబోతున్నాడు కాబట్టి ఫ్యాన్స్ లో మామూలు ఉత్సాహం లేదు.

పవన్ కళ్యాణ్ తో పాటుగా ఈ ఎపిసోడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ క్రిష్ కూడా హాజరు కాబోతున్నారు.. ఈ నెల 27వ తారీఖున ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని జరపబోతున్నారు..ఈ ఎపిసోడ్ ని ఆహా మీడియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎవరూ లేరు.. ఆయన ఈ షో కి రావడం వల్ల ఆహా సుబ్స్క్రిప్షన్స్ కౌంట్ వేరే స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నారు.