Sai Dharam Tej: మన టాలీవుడ్ లో హీరోలను అభిమానులు ఆరాధ్య దైవం లాగ భావిస్తారు..తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా ట్రీట్ చేస్తారు..ఒక్కోసారి అభిమానులు చూపించే హీరోలకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం గతం లో మనం చాలా గమనించాము..స్టేజి మీద హీరో మాట్లాడుతున్నప్పుడు అభిమానులు దూసుకొచ్చి కాళ్ళ మీద పడిపోవడం వంటివి ఈమధ్య ఒక ట్రెండ్ లాగ మారిపోయింది..ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటన లో అభిమానులు కారు మీదకి దూసుకొచ్చి పడిపోవడం,పవన్ కళ్యాణ్ కి చిన్నపాటి స్వల్ప గాయాలు అవ్వడం వంటివి మనం ఎన్నో చూసాము.

రీసెంట్ గా మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కి కూడా అలంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది..సాయి ధరమ్ తేజ్ ఇల్లు ఎక్కడో కనుక్కొని నేరుగా అతని ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నం చేసింది ఒక మహిళ..ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..సాయి ధరమ్ తేజ్ భద్రతా సిబ్బంది ఆమెని ఆపివేసి పోలీసులకు అప్పగించారు.
ఇక అసలు విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రాల్లోని మదురై కి చెందిన జోష్ కమల అనే మహిళ సాయి ధరమ్ తేజ్ కి వీరాభిమాని..ఎన్నో తిప్పలుపడి ఇంట్లో వాళ్లకి తెలియకుండా సాయి ధరమ్ తేజ్ ని కలవడానికి హైదరాబాద్ కి వచ్చింది..ఊరు కొత్త అయ్యినప్పటికీ కూడా సాయి ధరమ్ తేజ్ ఇంటి అడ్రస్ ని కనుక్కుంది..ఇక్కడి వరుకు అంత బాగానే ఉంది కానీ..ఆమె దౌర్జన్యం గా సాయి ధరమ్ తేజ్ ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నం చేసింది..ఆ సమయం లో సాయి ధరమ్ తేజ్ ఇంట్లో లేడు..అతని సెక్యూరిటీ సిబ్బంది ఆమెని నిలువరించి పోలీసులకు అప్పగించారు..పోలీసులు ఆమెని విచారించిన తర్వాత ఆమెకి మతి స్థిమితం లేదని చెప్పుకొచ్చారు.

ఇక ఆ తర్వాత ఆమెని పోలీసులు తమ సొంత ఖర్చులతో స్వస్థలానికి సురక్షితంగా పంపారు..ఈ సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..ఇక సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ కి సంబంధించిన టైటిల్ టీజర్ ని నిన్న విడుదల చేసాడు..ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు.