Manchu Lakshmi Rejected Baahubali: ఊహించని ట్విస్ట్… బాహుబలి ఆఫర్ రిజెక్ట్ చేసిన మంచు లక్ష్మి, ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే?

Manchu Lakshmi Rejected Baahubali: మోహన్ బాబు నటవారసుల్లో ఒకరైన మంచు లక్ష్మి పరిశ్రమలో పోరాటం చేస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అమెరికాలో మంచు లక్ష్మి కెరీర్ మొదలైంది. ఆమె ఏకంగా హాలీవుడ్ మీదే కన్నేశారు. కొన్ని అమెరికన్ టెలివిజన్ షోలకు ఆమె హోస్టింగ్ చేశారు. అలాగే ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. కారణం తెలియదు కానీ అమెరికా వదిలేసి ఇండియాకు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అనగనగా ఓ […]

Written By: Shiva, Updated On : March 29, 2023 8:20 am
Follow us on

Manchu Lakshmi Rejected Baahubali

Manchu Lakshmi Rejected Baahubali: మోహన్ బాబు నటవారసుల్లో ఒకరైన మంచు లక్ష్మి పరిశ్రమలో పోరాటం చేస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అమెరికాలో మంచు లక్ష్మి కెరీర్ మొదలైంది. ఆమె ఏకంగా హాలీవుడ్ మీదే కన్నేశారు. కొన్ని అమెరికన్ టెలివిజన్ షోలకు ఆమె హోస్టింగ్ చేశారు. అలాగే ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. కారణం తెలియదు కానీ అమెరికా వదిలేసి ఇండియాకు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అనగనగా ఓ ధీరుడు మూవీతో మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు.

అయితే మంచు లక్ష్మికి బాహుబలి చిత్రం కూడా ఆఫర్ వచ్చిందట. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. బాహుబలి పెద్ద సినిమా అవుతుందని తెలుసు. ప్రభాస్ వంటి పెద్ద హీరో మూవీ. బాహుబలి ఛాన్స్ మీరు ఎందుకు వదులుకున్నారని యాంకర్ అడిగారు. దానికి సమాధానంగా… కంటే ముందు ఓ ముగ్గురు రిజెక్ట్ చేశారు. మనకు రాసి పెట్టిన ఉన్న సినిమాలే దక్కుతాయి. దానికి కారణాలు చెప్పలేము.

Manchu Lakshmi

చెప్పాలంటే పెళ్లి చూపులు మూవీ నేను నిర్మించాల్సింది. దానికి కావాల్సిన సెట్ అప్ మొత్తం చేసి మరొకరి చేతిలో పెట్టాల్సి వచ్చింది. అలా చాలా మంచి సినిమాలు చేజారాయి. దానికి మనం ఏం చేయలేము… అని మంచు లక్ష్మి వెల్లడించారు. బాహుబలిలో మంచు లక్ష్మిని శివగామి పాత్రకు సంప్రదించారని సమాచారం. ప్రభాస్ తల్లి పాత్ర కావడంతో ఆమె రిజెక్ట్ చేసి ఉండవచ్చనే వాదన ఉంది. రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవిని కూడా అనుకున్నారు.

నిర్మాత, నటిగా కొనసాగుతున్న మంచు లక్ష్మికి డైరెక్షన్ చేయాలనే ఆలోచన లేదట. అది చాలా పెద్ద బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఆమె ప్రధాన పాత్ర చేసిన అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా మంచు లక్ష్మినే. ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాహ వేడుక చోటు చేసుకుంది. మనోజ్ తన ప్రేయసి మౌనిక మెడలో తాళి కట్టాడు. తమ్ముడు మనోజ్ పెళ్లి దగ్గరుండి లక్ష్మి చేశారు. అన్నీ తానై వ్యవహరించారు.