https://oktelugu.com/

Santhosh Narayanan: దసరా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఎవరు? అంత బాగా మ్యూజిక్ ఎలా ఇచ్చాడు?

Santhosh Narayanan: లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ గా అవతరించారు సంతోష్ నారాయణ్. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కి సంగీత ప్రియులు ముగ్దులవుతున్నారు. దసరా మూవీతో సంతోష్ నారాయణ్ తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ యూత్ ని ఊపేస్తుంది. పల్లె నేపధ్యానికి అనుగుణంగా ఆయన కంపోజ్ చేసిన చమ్కీల అంగీలేసి సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సంతోష్ నారాయణ్ ట్యూన్స్ కి సింగర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 29, 2023 / 08:13 AM IST
    Follow us on

    Santhosh Narayanan

    Santhosh Narayanan: లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ గా అవతరించారు సంతోష్ నారాయణ్. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కి సంగీత ప్రియులు ముగ్దులవుతున్నారు. దసరా మూవీతో సంతోష్ నారాయణ్ తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ యూత్ ని ఊపేస్తుంది. పల్లె నేపధ్యానికి అనుగుణంగా ఆయన కంపోజ్ చేసిన చమ్కీల అంగీలేసి సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సంతోష్ నారాయణ్ ట్యూన్స్ కి సింగర్ ధీ గాత్రం మరింత హైప్ తెచ్చింది.

    సంతోష్ నారాయణ్-ధీ కాంబోలో రూపొందిన సాంగ్స్ శ్రోతలను అలరించాయి. దసరా చిత్రానికి హైప్ తేవడంలో సంతోష్ నారాయణ్ కీలక పాత్ర పోషించాడు. సంతోష్ నారాయణ్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. దీంతో ఎవరీ సంతోష్ నారాయణ్ అనే చర్చ మొదలైంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరపల్లిలో 1983లో సంతోష్ నారాయణ్ జన్మించాడు. అతడి విద్యాభ్యాసం అక్కడే సాగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం రికార్డింగ్ ఇంజనీర్ గా, ప్రోగ్రామర్ గా పని చేశాడు.

    ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారడానికి ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి పని చేశాడు. 2012లో అత్తకత్తి అనే తమిళ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అనంతరం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన థ్రిల్లర్ ‘పిజ్జా’ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఈ మూవీ సక్సెస్ కావడంతో సంతోష్ నారాయణ్ కి బ్రేక్ వచ్చింది. జిగర్తాండ, ఇరుత్తు సురుత్తు చిత్రాలు ఆయనకు మరింత పేరు తెచ్చాయి. తెలుగులో సంతోష్ నారాయణ్ మొదటి చిత్రం గురు.

    Santhosh Narayanan

    ఇరుత్తు సురుత్తు చిత్ర రీమేక్ గా తెరకెక్కిన గురు మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. సంతోష్ నారాయణ్ అధికంగా తమిళ చిత్రాలకు పని చేస్తున్నారు. గురు మూవీ అనంతరం చాలా గ్యాప్ తీసుకుని దసరా మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ చిత్రానికి ఆయన ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

    కాగా సంతోష్ నారాయణ్ ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి పని చేయడం విశేషం. మీడియం బడ్జెట్ చిత్రాలకు పని చేసే సంతోష్ నారాయణ్ ఏకంగా ఓ స్టార్ హీరో వందల కోట్ల మూవీకి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ వెర్షన్స్ కి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మీద ఇండియా వైడ్ అంచనాలుండగా… సంతోష్ నారాయణ్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి.