
Pawan Kalyan: భీమ్లా నాయక్ విడుదలై నేటికి ఏడాది. ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేశారు. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన భీమ్లా నాయక్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్. రికార్డు వసూళ్లతో నిర్మాతల, బయ్యర్ల జేబులు నింపింది. పవన్ కళ్యాణ్ రూత్ లెస్ పోలీస్ పాత్రలో విశ్వరూపం చూపించారు. సిల్వర్ స్క్రీన్ మీద శివతాండం ఆడారు. హీరో రానా పవన్ తో ఢీ అంటే ఢీ అనే రోల్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ అదిరిపోయాయి. ఇక పవన్ డైలాగ్స్, మేనరిజమ్స్ గూస్ బంప్స్ కలిగించాయి.
భీమ్లా నాయక్ విడుదలైన నెలల వ్యవధిలో హరి హర వీరమల్లు విడుదల కావాల్సింది. కానీ అనుకున్న ప్రకారం ఆ చిత్రం షూటింగ్ జరగలేదు. భీమ్లా నాయక్ కంటే ముందు సెట్స్ పైకి వెళ్లిన హరి హర వీరమల్లు ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. స్పెషల్ సెట్స్ లో యాక్షన్ సీక్వెన్సులు రూపొందిస్తున్నారు. కాగా హరి హర వీరమల్లు సినిమా కంటే ముందు మరో సినిమా విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.
వినోదయ సితం రీమేక్ మరో ఆరు నెలల్లో థియేటర్స్ లో దిగనుందని టాలీవుడ్ టాక్. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. రెగ్యులర్ షూట్ కూడా మొదలైంది. పెద్దగా అవుట్ డోర్ షూటింగ్ లేకుండా నిరవధికంగా చిత్రీకరణ జరిపే ఏర్పాట్లు జరిగాయట. నాలుగు నెలల్లో షూటింగ్, మరో రెండు నెలల్లో ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తారట. వినోదయ సితం రీమేక్ ప్రేక్షకుల ఊహించని విధంగా అతి తక్కువ సమయంలో ప్రేక్షకుల ముందుకు రానుందట.

ఈ చిత్రంలో పవన్ పాత్ర నిడివి పరిమితంగానే ఉంటుంది. కేవలం 20-25 రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తి చేయనున్నారు. సాయి ధరమ్ పాత్ర నిడివి పూర్తి స్థాయిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పక్కాగా షూటింగ్ పూర్తి చేసేలా ఏర్పాట్లు జరిగాయి. కాబట్టి మరో ఆరు నెలల్లో పవన్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారట. మొదట దేవర అనుకున్నారట. అయితే దేవుడు టైటిల్ కే యూనిట్ మొగ్గుచూపిందట.