IPC Section 304(B) : 304(బీ)తో తాట తీసుడే..!

గతంలో 304(ఏ) కింద రెండేళ్లపాటు శిక్ష పడితే ఇప్పుడు 304 (బీ) కింద 10 ఏళ్ల శిక్ష పడుతుంది. పైగా అరెస్ట్‌ ఆయిన వెంటనే బెయిల్‌ కూడా రావటం లేదు. దీంతో ఇప్పుడు వాహన దారులు బెంబేలెత్తుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 7, 2023 9:55 am
Follow us on

IPC Section 304(B) : ఒక వ్యక్తి తన వాహనాన్ని స్నేహితుడికి ఇచ్చాడు. వాహనంపై వెళుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఎదురుగా వచ్చిన వ్యక్తి మరణించాడు. వాహనం నడుపుతున్న వ్యక్తికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు వాహనం నడిపిన వ్యక్తితోపాటు యజమానిని కూడా బాధ్యుడిని చేస్తూ 304(బి) కింద కేసు నమోదు చేశారు. నాన్‌ బెయిలబుల్‌ కావటంతో వాహనదారుడు లబోదిబోమన్నాడు.

మంచంలో అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తికి నోటీసు వచ్చింది. రోడ్డు ప్రమాదానికి కారణమైనం.. దుకు 304 (బి) కింద కేసు నమోదైందని పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులోని సారాంశం.. విషయమేమిటంటే.. అతనికి 10 ఏళ్లక్రితం ఒక మోటార్‌ సైకిల్‌ ఉండేది. దానిని అప్పట్లో అమ్మేశాడు. కొన్న వ్యక్తి పేరుమీదకు బదిలీ చేయలేదు. కొన్న వ్యక్తి బైక్‌పై వెళుతూ ఎదురుగా వచ్చే వ్యక్తిని ఢీకొన టంతో అతను చనిపోయాడు. ఇందులో నిందితులుగా బైక్‌ నడుపుతున్న వ్యక్తితోపాటు యజమానిని కూడా 304(బి) కింద పోలీసులు అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది.
ఇంతకీ సెక్షన్‌ 304ఏ, బీ ?
ఐపీసీ సెక్షన్‌ 304(ఏ).. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన, ప్రమాదానికి కారకుడైన డ్రైవరుపై దీనిని నమోదు చేసేవారు.. ఇందుకు దాదాపు 2 ఏళ్లపాటు జైలు శిక్షపడుతుంది. ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చట్టంలో సవరణ తీసుకువచ్చి 304(బీ) ఏర్పాటు చేసింది. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపినా, నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలు తీసినట్లు భావించినా దాదాపు హత్య కేసుతో సమానంగా దీనిని సవరించారు. డ్రైవర్‌ పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తున్నారు.
పదేళ్ల వరకు శిక్ష.. 
గతంలో 304(ఏ) కింద రెండేళ్లపాటు శిక్ష పడితే ఇప్పుడు 304 (బీ) కింద 10 ఏళ్ల శిక్ష పడుతుంది. పైగా అరెస్ట్‌ ఆయిన వెంటనే బెయిల్‌ కూడా రావటం లేదు. దీంతో ఇప్పుడు వాహన దారులు బెంబేలెత్తుతున్నారు. వాహనం ఇతరులకు, మైనర్లకు, లైసెన్స్‌ లేనివారికి ఇచ్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకుని జైలుపాలు కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు..  
భారతదేశంలో ట్రాఫిక్‌ ప్రమాదాలు ప్రతి సంవత్సరం మరణాలు, గాయాలు ఆస్తి నష్టం పెరుగుతూనే ఉన్నాయి. నేషనల్‌ క్రై మ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం 2014 నుంచి అత్యధికంగా 155,622 మరణాలు సంభవించాయి, అందులో 69,240 మరణాలు ద్విచక్ర వాహనాల కారణంగానే సంభవించాయి. ఐఐటీ ఢిల్లీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని రహదారుల పొడవులో జాతీయ రహదారులు కేవలం 2% మాత్రమే ఉన్నాయి, అయితే అవి మొత్తం రోడ్డు ప్రమాదాలలో 30.3%, మరణాలలో 36% ఉన్నాయి.